నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ బింబిసార సినిమాతో విశిష్ట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.