ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో పాపులర్ కుటుంబం సభ్యురాలైన ఈమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారనేది ఇపుడు బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇక ఈమె పెద్ద కూతురు అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో రేపు (బుధ వారం) ఈమె అంత్యక్రియలు చేయనున్నారు. ఈమె అకాల మరణం ఇపుడు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ పై పడింది. (Twitter/Photo)
ఇక తమ్ముడు ఎన్టీఆర్‌తో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన కళ్యాణ్ రామ్.. విడుదలకు ఒక రోజు ముందు బాబాయి బాలకృష్ణతో మరో ఈవెంట్ నిర్వహించాలనే ప్లాన్ చేసాడు. కానీ హఠాత్తుగా మేనత్త అకాల మరణంతో ఇపుడా ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సినిమా విడుదల తర్వాత హిట్ టాక్ వస్తే ఆ తర్వాత పరిస్థితులను బట్టి బాబాయిను పిలిచి గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నాడు కళ్యాణ్ రామ్. (Twitter/Photo)
పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు. తాజాగా సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేశారు. (Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌తో పాటు లిరికల్ పాటలను విడుదల చేస్తే మంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పాకళా వేదికలో గ్రాండ్‌గా జరిగింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రశంసించారు. (Twitter/Photo)
తాజాగా విడుదలైన కొత్త ట్రైలర్లో హద్దులను చెరిపేస్తూ.. రాజ్యపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష... ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి. మొత్తంగా రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు. (Twitter/Photo)
రాక్షసులు ఎరగని రావణ రూపం. శతృవులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. త్రిగర్తల సామ్రాజ్యధినేత బింబిసారుడి విశ్వరూపం. బింబిసారుడు అంటేనే మరణ శాసనం తో పాటు ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైనా బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు బాగున్నాయి.బార్బేయన్ కింగ్ బింబిసారుడు దాచి పెట్టిన నిధి సొంతం చేసుకోవడానికీ కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నుతాయి. (Twitter/Photo)
ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటోందో అని డైలాగులు పేలాయి. ‘ఎంత మంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్లో ‘ఏ టైమ్ ట్రావెల్ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్. (Twitter/Photo)
ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. (Twitter/Photo)