ఆ తర్వాత తాను వెళ్లి ఆసుపత్రిలో విద్యాసాగర్‌తో మాట్లాడానని.. ఆ రోజు తన బర్త్ డే కావడంతో విషెస్ కూడా చెప్పారని కళా మాస్టర్ చెప్పారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పడంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వాళ్ళు సాయం చేసినా ట్రాన్స్‌ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని అన్నారు.