Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. లక్ష్మీకళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి వరుస సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కాజల్ ఈ ఏడాది వరుస సినిమాల అవకాశాలు అందుకుని దూసుకుపోతుంది. ఇక తన పెళ్లి తర్వాత కూడా కాజల్ అవకాశాలు అందుకోగా తన భర్త సినిమాలకు దూరంగా ఉండమని కోరితే సినిమాలు వదులుకుంటానని చెప్పి నెటిజన్లకు.. అభిమానులకు షాక్ ఇచ్చింది ముద్దుగుమ్మ.