Kajal Aggarwal: పెళ్లి తర్వాత తొలిసారి అలాంటి పాత్రతో పలకరిస్తోన్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal | పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తన కెరీర్‌ను కొనాసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ‘ఆచార్య’తో పాటు మంచు విష్ణు మోస‌గాళ్లులో న‌టిస్తోంది. అలాగే త‌మిళ్‌లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌సన ఇండియ‌న్ 2లో న‌టిస్తున్నారు. హిందీలో ముంబ‌యి సాగ‌లో క‌నిపించ‌నుంది. ఇన్ని సినిమాలు ఉండగానే తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అవుతోంది.