Kajal Aggarwal: లైవ్ టెలికాస్ట్‌లో ఆడియన్స్‌‌ను భయపెట్టనున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal Web Series LIVE TELECAST | కాజల్ అగర్వాల్.. తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ సిరీస్ పేరు ‘లైవ్ టెలికాస్ట్’ . త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కాజల్ అగర్వాల్ విడుదల చేసింది. కాజల్ అగర్వాల్ తాను నటించిన తొలి వెబ్ సిరీస్.. చూసి ఆనందించండి అంటూ పోస్ట్ చేసింది.