Kajal Aggarwal : వరంగల్‌లో సందడి చేసిన కాజల్ అగర్వాల్ దంపతులు.. ఫోటోస్ వైరల్..

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి వరంగల్‌లో సందడి చేసారు. అక్కడ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి ‘పుల్లయ్య షాపింగ్ మాల్’ను ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలకు సింగిల్‌గా వెళ్లే కాజల్ అగర్వాల్.. ఇపుడు తోడుగా భర్తను తీసుకెళ్లింది. ఇక కాజల్ అగర్వాల్ దంపతులను చూసేందుకు అభిమానులు కరోనాను లెక్క చేయకుండా పోటెత్తారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.