ఇక అది అలా ఉంటే టాలీవుడ్ చందమామ కాజల్.. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2లో నటిస్తు్న్నారు. ఈ సినిమాతో పాటు ఆ ఓ మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మోసగాళ్లు తర్వాత మరే సినిమాలోను ఆమె నటించడం లేదు. చిరంజీవి ఆచార్యలో నటించనప్పటికీ ఏవో కారణాలతో ఆమె పాత్రను తొలగించారు. ఇక లేటెస్ట్గా కాజల్‌కు తెలుగులో మరో అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. Photo : Twitter
కాజల్ తెలుగులో బాలయ్య 108లో నటించనుందని తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు బాలయ్యలు ఉంటారట. దీంతో సీనియర్ బాలయ్య సరసన కాజల్ నటించనుందని వీరికి కూతురుగా శ్రీలీల కనిపించనుందని లేటెస్ట్ టాక్. కాగా ఈ సినిమాలో కాజల్ నటించడానికి భారీగా డిమాండ్ చేస్తోందట. ఆమె అడిగిన మొత్తాన్ని కూడా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి కాజల్‌కు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆగస్టు 15కు రానుందని టాక్. Photo : Twitter
ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే.. కాజల్‌కు మరో మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు చంద్రముఖి2 సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా 2005లో విడుదలైన రజనీకాంత్ చంద్రముఖికి అధికారిక సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో వడివేలు, రాధికా శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Photo : Instagram
ఇక ప్రెగ్నన్సీ కారణంగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె చివరగా ఆచార్యలో నటించారు. అయితే.. ఆ సినిమాలో తన క్యారెక్టర్‌ను కొన్ని కారణాల వల్ల తొలగించారు దర్శక నిర్మాతలు. అది అలా ఉంటే.. ఇటీవలే కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాజల్ తన ముద్దుల కొడుకు నీల్‌కి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ఉంటారు. Photo : Instagram Kajal Instagram
కాజల్, శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2లో కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలై, కొన్నాళ్లు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటీ నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పూర్తికాకుండా పోయింది. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగిన తరువాత.. సెట్లో ప్రమాదం జరగడం.. ఆ తర్వాత నటుడు వివేక్ మృతి, దీనికి తోడు దర్శకుడు శంకర్‌కు, లైకా ప్రొడక్షన్స్ మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఇలా కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు.. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. Photo : Instagram
ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు శంకర్.. రామ్ చరణ్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఆ సినిమా అలా ఉండగానే శంకర్ భారతీయుడు2 కూడా రెస్యూమ్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న కాజల్ పెళ్లి చేసుకుని ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కాజల్ స్థానంలో మరో హీరోయిన్ను తీసుకోచ్చే ప్రయత్నంలో ఉన్నారని టాక్ నడిచింది. అయితే అలాంటిదేమీ లేదని కాజల్ స్వయంగా పేర్కోంది. ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్‌లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Photo : Instagram
చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్లపాటు తెలుగులో అలరించారు. ఇక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఆమె చిరవగా చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన ఆచార్యలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా చేశారు. అయితే ఆమె నటించిన ఆ పార్ట్‌ను దర్శక నిర్మాతలు తొలగించారు. Photo : Instagram
సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తులు బాగానే కూడబెట్టినట్లు తెలుస్తోంది. కాజల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజల్ కూడా వంద కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు. కాజల్ సినిమాలతో పాటు తన కెరీర్లో స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్రస్తుతం తన భర్త గౌతమ్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. Photo : Instagram
ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. Photo : Instagram
ఇక కాజల్ పర్సనల్ విషయానికి వస్తే.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆ మధ్య తన చిన్ననాట మిత్రుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక కాజల్ కుమారుడికి 'నీల్ కిచ్లూ' అనే పేరు పెడుతున్నట్టు తెలిపారు కాజల్ సోదరి నిషా అగర్వాల్ తెలిపిన సంగతి తెలిసిందే. కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్‌లో కాజల్ అగర్వాల్ పెళ్లాడారు. Photo : Twitter
అందాల చందమామ కాజల్ తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. ఎప్పటికపుడు తన ప్రెగ్నెసీ ఫోటోలను మరోసారి అభిమానులతో షేర్ చేసుకన్న విషయం తెలిసిందే కదా. కాజల్ అగర్వాల్ .. పండంటి మగబిడ్డకు ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జన్మనిచ్చారు. Photo : Instagram
కాజల్ అగర్వాల్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందంటే.. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చందమామ రేంజ్ ఏంటో..? ఇప్పుడు కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది కాజల్. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో ఈమె మెయిన్ హీరోయిన్.Photo : Twitter
ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళైపోయినా కూడా ఇప్పటికీ కాజల్ రేంజ్ మాత్రం అలాగే ఉంది. సినిమాకు రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ అదరహో అనిపిస్తుంది కాజల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. పెళ్లికి ముందే కండీషన్స్ అప్లై అనేసింది కాజల్ అగర్వాల్. కెరీర్‌కు అడ్డురాని పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెప్పేసింది ఈమె. (Instagram/Photo)
ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. ప్రస్తుతం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరుగా నిలిచింది. కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది. దీంతో ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Instagram
గర్భం కారణంగా కాజల్ నాగార్జున ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకుంది. నిజానికి నాగార్జున ఘోస్ట్ సినిమా ఒప్పుకున్న తర్వాత.. కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత తాను గర్భవతి అనే విషయం తెలియడంతో ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకుంది. ప్ణ్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండటంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది కాజల్. ఆమె ప్లేస్‌లో సోనాల్ చౌహాన్‌ను కథానాయికగా తీసుకున్నారు. (Instagram/Photo)