Kajal Aggarwal: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వదిలారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వదిలారు.
2/ 8
ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ని ఎంపిక చేశారు మేకర్స్. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వదిలిన కాజల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీలో శ్రీలీలను కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే.
3/ 8
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమా నందమూరి అభిమానులకు డిఫరెంట్ అనుభూతి ఇవ్వనుందట. బాలయ్య కోసం పదునైన స్క్రిప్ట్ రెడీ చేసుకున్న అనిల్ రావిపూడి.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ సినిమా రూపొందిస్తారట.
4/ 8
తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుండగా.. ఆయన సరసన కాజల్ నటించనుందని అంటున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
5/ 8
ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్‌లో కనిపించనున్నాడట. బాలయ్య కోసం ఎవ్వరూ ఊహించని రోల్ రాసుకొని సెట్స్ మీదకు తీసుకొస్తున్నారట అనిల్ రావిపూడి. చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంటుందని తెలుస్తోంది.
6/ 8
ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన మార్క్ కామెడీ జోడిస్తూ ఈ సినిమాను రూపొందించబోతున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ చేస్తున్నారట. చిత్రంలో బాలయ్యను చాలా స్పెషల్ గా చూపించబోతున్నారట.
7/ 8
ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన మార్క్ కామెడీ జోడిస్తూ ఈ సినిమాను రూపొందించబోతున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ చేస్తున్నారట. చిత్రంలో బాలయ్యను చాలా స్పెషల్ గా చూపించబోతున్నారట.
8/ 8
ఇకపోతే ఈ మూవీ కోసం ఇప్పటికే కొన్ని టైటిల్స్ పరిశీలనలోకి తీసుకున్న అని రావిపూడి.. చివరకు 'బ్రో ఐ డోంట్ కేర్' (Bro I dont care) అనే టైటిల్ లాక్ చేయాలని ఫిక్సయినట్లు సమాచారం. తాను రాసుకున్న కథ ప్రకారం ఇదే టైటిల్ సరిగ్గా యాప్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట.