తెలుగు సినీ ఇండస్ట్రీలో నవరస నటనా సార్వభౌముడిగా పేరుపొందిన ప్రముఖ టాలీవుడ్ (tollywood) నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈయన తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తరం వరకు అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. (Twitter/Photo)
సత్యనారాయణలో ఎన్టీఆర్ పోలికలు వుండటంతో ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. అంతేకాదు కెరీర్ ప్రారంభంలో రామారావుకు డూప్‌గా నటించారు సత్యనారాయణ. రాముడు భీముడు సినిమాతో పాటు పలు చిత్రాల్లో ఎన్టీఆర్ డూప్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తన చిత్రాల్లో ఆయనకు ప్రత్యేక వేశాలు ఇస్తూ ఆయన్ని నటుడిగా ప్రోత్సహించారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సత్యనారాయణలోని విలనిజాన్ని వెలికితీశారు. (Twitter/Photo)
పౌరాణిక సినిమాల విషయానికొస్తే...‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా...‘లవకుశ’లో భరతుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసునుడిగా, ‘శ్రీకృష్ణపాండవీయం’లో ఘటోత్కచుడుగా, ‘దాన వీర శూర కర్ణ’లో భీముడిగా, ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా, ‘సీతా కళ్యాణం’లో రావణుడిగా, శ్రీరామపట్టాభిషేకం’ సినిమాలో భరతుడిగా ఎన్నో పౌరాణిక పాత్రల్లో విలనిజంతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు సత్యనారాయణ. (Twitter/Photo)
చివరగా సత్యనారాయణ కార్తిక్ రాజు, మిస్తి చక్రవర్తి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘ధీర్ఘాయుష్మాన్ భవ’ చిత్రంలో నటించారు. పూర్ణానంద్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ మరోసారి యముడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ మూవీలో సత్యనారాయణ మరోసారి యముడి పాత్రలో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీ పూర్తైన ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. (Twitter/Photo)