కృష్ణంరాజు | కృష్ణంరాజు కూడా నర్సాపురం, నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు అప్పట్లో వాజ్‌పేయ్ మంత్రి వర్గంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకు ఎక్కారు. ఆ తర్వాత 2009 ఎన్నికల ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో పార్టీ చేరారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల ముందు తిరిగి బీజేపీ గూటికి చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీలోక్రియాశీలకంగా ఉంటూనే కృష్ణంరాజు కన్నుమూయడం విషాదకరం. (File/Photo)
మన దగ్గర సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా.
జయప్రద | తెలుగునాట ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయప్రద.. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ముందు తెలుగు దేశం తరుపున రాజ్యసభ సభ్యరాలిగా పనిచేసిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ తరుపున ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్ పూర్ లోక్‌సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్ఎల్డీ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీలో జాయిన్ అయిన జయప్రద మరోసారి రామ్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసారు.కానీ ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి అజాం ఖాన్ చేతిలో ఓడిపోయారు.
చిరంజీవి | మెగాస్టార్‌గా చక్రం తిప్పుతున్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు చిరు. కానీ అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయాడు చిరంజీవి. తర్వాత కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి కొన్నాళ్లు మన్మోహన్ సింగ్ క్యాబినేట్లో మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయారు మెగాస్టార్.
నందమూరి బాలకృష్ణ | బాలకృష్ణ నందమూరి కూడా ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఈయన. తండ్రి పార్టీలోనే తన వంతుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు బాలయ్య. 2019 ఏపీలో జరిగిన ఎన్నికల్లో రెండోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ | పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. ఈయన తన సినిమా కెరీర్ కాదనుకుని జనసేన పార్టీతో బిజీగా మారిపోయాడు. గత ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగాడు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. (Twitter/Photo)
రోజా | టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజా.. ఆ తర్వాత కాంగ్రెస్, ఆపై జగన్ వైసీపీలో జాయిన్ అయి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇపుడు మరోసారి MLA గా పోటీచేసి గెలిచారు. ఇపుడు ఏపీఐఐసీ చైర్మన్ అయ్యారు. మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. మొదటి రెండు సార్లు టీడీపీ తరుపున ఓడి.. రెండు సార్లు వైసీపీ తరుపున గెలిచారు. తాజాగా ఏపీ మంత్రి వర్గ విస్తరణలో వైయస్ జగన్ మంత్రి వర్గంలో మినిష్టర్ అయి తన చిరకాల కోరిక తీర్చుకున్నారు. (File/Photo)
తెలంగాణ , టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు.టీఆర్ఎస్ తరుపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు." width="875" height="583" /> విజయశాంతి |విజయశాంతి కూడా బీజేపీ,తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు.టీఆర్ఎస్ తరుపున మెదక్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మళ్లీ తన మాతృ పార్టీ బీజేపీలో చేరారు. (File/Photo)
శత్రుఘ్న సిన్హా | రెబల్ స్టార్‌గా బాలీవుడ్లో సంచలన సినిమాలు చేసిన శత్రుఘ్న సిన్హా ఆ తర్వాత రాజకీయాల్లోనూ సత్తా చూపించారు. బిజేపీలో ఆయన పలు కీలక పదవులు అధిష్టించారు. మొన్నటి ఎలక్షన్స్ ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పాట్నా సాహెబ్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తృణముల్ కాంగ్రెస్‌లో చేరి మొన్న జరిగిన బెంగాల్ ఉప ఎన్నికల్లో అసన్సోల్ నుంచి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. (File/Photo)
రజినీకాంత్ | రజినీకాంత్ గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. అంతేకాదు పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. కానీ ఇంతలోనే అనారోగ్యం పాలు కావడంతో తన రాజకీయాల్లో రావడం లేదంటూ ప్రకటించి మళ్లీ సంచలనం రేపారు. మొత్తంగా రాజకీయాల్లో వస్తానంటూ ఊరిస్తూ... చివరకు ఉసురు మనిపించారు. (File/Photo)
తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్నిహీరో విజయ్.. ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఐనా.. విజయ్ పొలిటిక్ ఎంట్రీకి ఇవ్వబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో ఈయన డీఎంకేకు పరోక్షంగా మద్దుతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. (File/Photo)
ఉదయనిధి స్టాలిన్. |ఉదయనిధి స్టాలిన్. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు చెపాక్ నియోజకవర్గం నురంజీవి రాజకీయాలు,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,శత్రుఘ్నసిన్హా రాజకీయాలు,జయలలిత రాజకీయాలు,ప్రకాశ్ రాజ్ రాజకీయాలు,తెలుగు సినిమా,తమిళ్ సినిమా" width="1280" height="720" /> సునీల్ దత్ |ముంబై నార్త్ ఈస్ట్ నుంచి సునీల్ దత్ ఏకంగా ఐదుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దత్ తనదైన ముద్ర వేసారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా పని చేసారు. (File/Photo)
మనోజ్ తివారి| మనోజ్ తివారి.. మనకు పెద్దగా తెలియని పేరు. కానీ భోజ్‌పురిలో సంచలనం ఈ పేరు. అక్కడ సూపర్ స్టార్‌గా సేవలు అందిస్తూనే రాజకీయాల్లోనూ సత్తా చూపించాడు మనోజ్ తివారి. ప్రస్తుతం బీజేపీ తరుపున ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి దివంగత షీలా దీక్షిత్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. (File/Photo)
విజయ్ కాంత్ | విజయ్ కాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నాడు. సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఈయన.. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ ఎన్నికల్లో ఈయన పార్టీ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీ పొత్తులో భాగంగా 4 ఎంపీ సీట్లలో పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేకపోయింది. (File/Photo)
కార్తీక్ | ఒకప్పటి తమిళం గ్లామర్ హీరో కార్తీక్ కూడా రాజకీయాల్లో ప్రవేశించి తన లక్ పరీక్షించుకున్నారు. ఐనా ఒరిగిందేమి లేదు. 2009లో అహిలా ఇండియా నాడలుమ్ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాతపించారు. ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. (Ahila India Naadalum Makkal Katchi). ఆ తర్వాత 2018లొ మనిత ఉరైమైగల్ కాక్కుమ్ కచ్చి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. ( Manitha Urimaigal Kaakkum Katchi on 15 December 2018). ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. (Twitter/Photo)