K Viswanath Director cum Actors : ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే...బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నారు. కళా తపస్వీ కే.విశ్వనాథ్ కూడా దర్శకుడు నుంచి నటుడిగా ప్రమోషన్ పొందారు. ఈయన కంటే ముందే తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన దర్శక, నటులు ఎవరున్నారంటే.. (File/Photo)
దివంగత లెజండరి డైరెక్టర్ కె.విశ్వనాథ్ కూడా మెగాఫోన్ పక్కన పట్టిన తర్వాత యాక్టర్‌గా ‘శుభ సంకల్పం’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసారు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు.అటు మరో దిగ్గజ దర్శకుడు కే.బాలచందర్..కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో కనిపించడం విశేషం. (Twitter/Photo)
Rajamouli - Raghavendra Rao : ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే...బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాతో నటుడిగా సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు. అంతకు ముందు చాలా మంది దర్శకులు నటులుగా అపుడపుడు తెరపై మెరిసారు. (File/Photo)
నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఇదేదో సందేశాత్మక సినిమా కాదు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒకరు రమ్యకృష్ణ, సమంత, అనుష్క, తమన్నా నటిస్తున్నట్టు సమాచారం. (Twitter/Photo)
దాసరి నారాయణరావు | దర్శక నటుల్లో ముందుగాల చెప్పుకోవాల్సింది దర్శకరత్న దాసరి నారాయణరావుని. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకునమే కాదు. సొంతంగా యాక్ట్ చేసి ఔరా అనిపించుకున్నారు దాసరి నారాయణ రావు. ఒక దర్శకుడిగా ఉంటూ ఎక్కువ సినిమాల్లో అది కూడా వేరే దర్శకుల సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న దర్శక నటుడిగా దాసరి నారాయణ రావు రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి. (File/Photo)
కోడి రామకృష్ణ | దాసరి తర్వాత ఆయన శిష్యుడు దివంగత కోడి రామకృష్ణ కూడా గురువు రూట్లోనే నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ముందుగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘తూర్పు పడమర’లో చిన్న క్యారెక్టర్లో కనిపించిన కోడి రామకృష్ణ..ఆ తర్వాత తన ఓన్ డైరెక్షన్లో తెరకెక్కిన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. (Twitter/Photo)
ఎస్వీ కృష్ణారెడ్డి | ఎస్వీ కృష్ణారెడ్డి కూడా డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న తర్వాత ‘ఉగాది’,‘అభిషేకం’ వంటి సినిమాలత హీరోగా ముఖానికి మేకప్ వేసుకున్నాడు. అంతకుముందు 80ల చిరంజీవి హీరోగా చ్చిన ‘కిరాతకుడు’చిత్రంలో కృష్ణారెడ్డి చిన్న రోల్ కనిపించిండం విశేషం. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కమలకర కామేశ్వరరావు పాత్రలో మెప్పించడం విశేషం. (Twitter/Photo)
ఉపేంద్ర | కన్నడ విషయానికొస్తే.. యాక్టర్ ఉపేంద్ర కూడా డైరెక్టర్ గా పేరు సంపాదించిన తర్వాతే హీరో అయ్యాడు. అప్పట్లో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘ఓంకారం’ సినిమాను ఉపేంద్రనే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రెజెంట్ హీరోగానే నటిస్తున్నారు. ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ లిస్టులో కన్నడ నటుడు సుదీప్ కూడా వున్నారు. అప్పట్లో కన్నడల కొన్ని రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాతే ఆయన హీరో అయ్యారు. (File/Photo)
భాగ్యరాజ్ | డైరెక్షన్ టూ యాక్షన్ రూటు కొచ్చిన డైరెక్టర్ లిస్ట్‌లో తమిళ డైరెక్టర్ భాగ్యరాజ్‌ను ముందుగా చెప్పుకోవాలి. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటూనే యాక్టింగ్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాకా ఆయన దర్శకత్వంలోనే ఎన్నో సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి వారెవ్వా అనిపించారు.(News18/Tamil)