విశ్వనాథ్ గారు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివి. ముఖ్యంగా తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి, కల్చర్ కు చేసిన సేవ ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుంది. ఆయన చేసిన అన్ని సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాల నుంచి అందరూ ఒక మెసేజ్ ను తీసుకుని ముందుకు వెళ్లేలా ఉంటాయన్నార రోజా. (Twitter/Photo)
ఇక విశ్వనాథ్ తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నట్టు మినిష్టర్ రోజా తెలిపారు. ఇక రోజా కళా తపస్వీ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయకపోయినా.. ఆయనతో కలిసి ‘వజ్రం’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. (Twitter/Photo)