K Viswanath Passed Away | కే. విశ్వనాథ్ ఆయన పేరు చెబితే ఒక ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’ సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్దర్శకుడు. ఆయన కళాతపస్వి..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్. ఈ గురువారం రాత్రి (2/2/2023)న కన్నుమూసారు. ఈయన మరణంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయలేకపోయినందకు తెగ బాధపడిపోయారట. వివరాల్లోకి వెళితే.. (Chiranjeevi with K Vishwanath Photo : Twitter)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్టీఆర్,కృష్ణల తర్వాత తెలుగులో నెంబర్ వన్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ సినీ సామ్రాజ్యాన్ని ఏలారు. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీతో హీరోగా తన స్టామినా తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. (Twitter/Photo)
అప్పట్లో చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి సమయంలో చిరు ‘స్వాతిముత్యం’ సినిమా చేసారు. ఆ సినిమా చూసిన తర్వాత చిరుకు రెండు రోజులు నిద్రపట్టలేదట. ఇలా కూడా నటిస్తారా ? అనిపించింది. అన్ని అర్హతలు ఉన్న తనకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావడం లేదంటూ తీవ్రంగా కుమిలిపోయారట. ఇక విశ్వనాథ్ ముందుగా ఈ పాత్ర కోసం చిరునే అనుకున్నారట. (Twitter/Photo)
ఆ తర్వాత కొన్ని రోజులకు కే.విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి తన అభిప్రాయాలను పంచుకున్నారు చిరు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘స్వయంకృషి’ సినిమా చేసారు. గతంలో వీళ్లిద్దరు ‘శుభలేఖ’ సినిమా చేసినా.. అప్పటికీ చిరుకు స్టార్డమ్ లేదు. చిరు స్టార్డమ్ అందుకున్న తర్వాత విశ్వనాథ్‌తో ‘స్వయంకృషి’ సినిమా చేసారు. (Twitter/Photo)
ఈ సినిమాలో చిరు చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించారు. అందుకోసం చిరు చెప్పులు బాగా కుట్టడం తెలిసిన వ్యక్తిని సెట్లో పెట్టుకుని ఆయన సూచనల మేరకు ఈ సినిమా షూటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో చిరంజీవి తొలిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఉత్తమ నటుడుగా తొలి నంది అవార్డు అందుకోవడం విశేషం.
ఈ చిత్రంలో కే.విశ్వనాథ్ సీఎం పాత్రలో నటించడం విశేషం. ఈ రకంగా కే.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించడమే కాకుండా.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి. మొత్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా తీర్చిదిద్దిన ఈయనకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో పాటు సినీ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)