కే. విశ్వనాథ్ ఆయన పేరు చెబితే ఒక ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, స్వయంకృషి’వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్దర్శకుడు. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్భాందవుడు. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్ద పీటవేసి, శృతిలయలు నేర్పిన దర్శక యశస్వీ,. ఈయనకు జాతీయస్థాయిలో పేరు తీసుకురావడంలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావుకు ప్రత్యేక స్థానం ఉంది. విశ్వనాథ్‌ను ఈ బ్యానర్‌ను వేరు చేసి చూడలేము.
గంగిగోవు పాలు గరిటడైనను చాలు అన్నట్టు... తీసినవి కొన్ని సినిమాలైనా కళాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచాడు. రాశి కంటే వాసి కి ప్రాధాన్యం ఇచ్చి.. తెలుగుచిత్ర పరిశ్రమలో ఒక స్వాతిముత్యం లాంటి చిత్రాలను అందించిన సంస్థ పూర్ణోదయ. ఈ సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. తెలుగు సినీ రంగానికి అనుకోకుండా కలిగిన ఒకానొక అదృష్టం ‘పూర్ణోదయ’ ఆవిర్భాభం. కళాతపస్వీ కళాత్మక చిత్రాలతోనే కమర్షియల్ హిట్స్ సాధించిన ఘనత పూర్ణోదయ సంస్థకు దక్కింది. ఈ మూవీ నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు.ఈయన బ్యానర్‌కు విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. (file/Photo)
ఇక పూర్ణోదయ బ్యానర్లో తెరకెక్కిన మూడో చిత్రం ‘శంకరాభరణం’ తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా చెప్పుకునే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత ఏడిద ఇంటిపేరు శంకరాభరణం గా మారిపోయింది. ప్రాభవం కోల్పోయిన ఒక సంగీత విద్వాంసుడికీ, వేశ్యకు ఉండే సున్నితమైన సంబంధాన్ని అపురూప చిత్ర రాజంగా మలిచారు కళాతపస్వి. ఈ చిత్రానికి జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, కె.వి.మహదేవన్ సంగీతం, బాలూ ఆలాపన వెరశీ.. ఉత్తమోత్తమ చిత్రంగా నిలిచిపోయేలా చేసింది. రాగం తానం పల్లవి అంటూ ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికి ఇంటింటా మారుమ్రోగుతునే ఉన్నాయి.
ఈ చిత్రంలో శంకరశాస్త్రి పాత్రకు మొదట ఏన్నార్, శివాజీ గణేషన్, కృష్ణంరాజు అని కొన్ని పేర్లు అనుకున్నారు. చివరికి ఇమేజ్ లేని నటుడైతే మేలని ఏడిద తన నాటకాల మిత్రుడైన జె.వి.సోమయాజులును ఈ పాత్రకు ఎంపిక చేశాడు. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశారు సోమయాజులు. ఈ చిత్రం సాధించిన అద్భుతమైన విజయం సాధించింది. అవార్డులకు లెక్కేలేదు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శింపబడి తెలుగు సినిమా కీర్తి పతాకం ఎగురవేసింది శంకరాభరణం. ఈ చిత్రంతో నిర్మాతగా పూర్ణోదయ బ్యానర్ కు తెలుగులో ఎనలేని కీర్తిప్రతిష్ఠలు దక్కాయి. శంకరాభరణం చిత్రానికి రాష్ట్రపతి నుంచి స్వర్ణ కమలం అందుకున్నది కూడా అదే రోజు కావడం విశేషం.(Twitter/Photo)
కళా తపస్వీ పూర్ణోదయ చిత్రాలతోనే కమల్ హాసన్ రెండు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నాడు. కె.విశ్వనాథ్, కమల్ హాసన్, ఇళయరాజా కాంబినేషన్ లో తీసిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు నిర్మించినందుకు నటుడిగా కమల్ కు... దర్శకుడిగా విశ్వనాథ్ కు...సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు ...పూర్ణోదయ బ్యానర్ కు అఖండ కీర్తి ప్రతిష్ఠలు సాధించి పెట్టాయి.
మాస్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవిలో మంచి నటుడు ఉన్నాడనే నమ్మకంతో స్వయంకృషి, ఆపద్భాంధవుడు చిత్రాలను నిర్మించాడు నాగేశ్వరరావు. కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలతో చిరంజీవి రెండు సార్లు ఉత్తమ నటుడిగా నందులందుకున్నాడు. ఈ విధంగా పూర్ణోదయ బ్యానర్ లో కమల్, చిరులు ఇద్దరూ రెండేసిసార్లు నంది అవార్డులందుకోవడం ఒక విశేషం. దానికి కళాతపస్వీ దర్శకుడు కావడం మరో విశేషం.
మొత్తంగా కళా తపస్వీ దర్శకుడిగా ఇంత పేరు రావడంలో ఏడిద నాగేశ్వరరావు బ్యానర్ పూర్ణోదయ క్రియేషన్స్ ఎంతగానో తోడ్పడింది. ఒక రకంగా కళా తపస్వీలోని దర్శకుడిని గుర్తించి నిర్మాతగా సినిమాలు నిర్మించిన ఘనత పూర్ణోదయ నాగేశ్వరరావుకు దక్కుతోంది. ఒక రకంగా విశ్వనాథ్ సినిమాలతో పూర్ణోదయకు అంతే పేరు దక్కింది. (Twitter/Photo)