తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ సినిమా ఫిబ్రవరి 2, 1980లో విడుదలై ప్రపంచ నలు మూలల్లో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో మేధావులతో పాటు సామాన్యులను ఈ సినిమా మెప్పించింది. ఈ చిత్రం విడుదలై 43 యేళ్లకే కళాతపస్వీ కే.విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం యాదృశ్చికం అనే చెప్పాలి. ఈ సినిమా సాధించిన కొన్ని రికార్డుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలై న్యూస్ 18 ప్రత్యేక కథనం.. (Photo : Twitter)
ఈ సినిమా విడుదలైన తర్వాత ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావనే ఉండేది. ముందుగా ఈ పాత్ర కోసం ముందు కృష్ణంరాజు, శివాజీ గణేషణ్ వంటి వారిని అనుకున్నారు విశ్వనాథ్. చివరగా ఇమేజ్ ఉన్న నటుడు ఈ పాత్ర చేస్తే పండదనే ఉద్దేశ్యంతో చివరగా ఈ పాత్ర అప్పటికే నటుడిగా ఉన్న జేవీ రమణ మూర్తి అన్నగారైన జేవీ సోమయాజులను తీసుకున్నారు కే.విశ్వనాథ్. అప్పటికే సోమయాజులు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. Photo : Twitter
కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ సినిమాలో శంకరశాస్త్రి, తులసి మధ్య అలవికాని అనుబంధం తెలుగువారినే కాకుండా పక్క రాష్ట్రాల్లో ప్రజల్నీ కూడా మెప్పించింది. ఈ చిత్రాన్ని పదమూడున్నర లక్షల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమాను కే.విశ్వనాథ్ 55 నుంచి 60 రోజుల్లో పూర్తి చేశారు. Photo : Twitter
ఈ సినిమా ప్రభావితంతో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . తెలుగోడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకున్నారు. ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. ఈ సినిమాను ఎక్కువగా , రఘుదేవపురం,పోలవరం, రామచంద్రపురం, అన్నవరం, సోమవరెం,చెన్నెలోని తిరువాన్మయూరు, కర్ణాటకలోని బేలూరు, హలిబేడులో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. Photo : Twitter
స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు బెస్ట్ సింగర్‌గా తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సినిమా క్లాస్ మాస్ తేడా లేకుండా అందరినీ అలరించింది. సినిమాలంటే ఇష్టం లేని వారు సైతం ‘శంకరాభరణం’ కోసం థియేటర్ కు వెళ్లిన సందార్భాలున్నాయి. Photo : Twitter
విశ్వనాథ్ దర్శకత్వంలో పాటు ఈ సినిమాకు కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిస్తే.. జంధ్యాల మాటలు, జేవీ సోమయాజులు (శంకరశాస్త్రి), మంజుభార్గవి, అల్లు రామలింగయ్యల నటన ‘శంకరాభరణం’ను ఓ కళాఖండంగా మార్చాయి. అప్పట్లో , ఏఎన్నార్, శివాజీ గణేషన్, యమ్జీఆర్, రాజ్‌కుమార్, హిందీలో శాంతారామ్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్ ఈ చిత్రాన్ని పని గట్టుకొని చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. Photo : Twitter