ఖైదీ, కొండవీటి రాజా, అడవిదొంగ, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్‌తో నెంబర్ వన్ పొజిషన్‌కి ఎదుగుతున్న పూర్తిగా తన కమర్షియల్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా స్వయంకృషి. ఈ సినిమా చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది. Image source Twitter
చిరంజీవి స్వయంగా చెప్పులు కుడుతూ నటించడం ఈ సినిమాకి మరింత వన్నె తెచ్చింది. అప్పట్లో ఈ సినిమా చూసిన కొంతమంది తమ చెప్పుల షాప్‌కు స్వయంకృషి అని పేరు పెట్టుకున్నారు. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుందని.. ఏ ఫీల్డ్‌లోనైనా విజయం సాధిస్తామనే మంచి సందేశాన్ని స్వయంకృషి అందించింది. Image source Twitter