Home » photogallery » movies »

K POP SINGER JI SOO CUTE PHOTOS NK

కే పాప్ వరల్డ్‌లో దూసుకెళ్తున్న సింగర్ జిసూ

Kim Ji-soo : కె పాప్ (దక్షిణ కొరియా పాప్) సింగర్, నటి, మోడల్, బ్లాక్‌పింక్ గర్ల్ గ్రూప్ సభ్యురాలైన కిమ్ జి సూ గురించి చెప్పుకోతగ్గ అంశాలు కొన్ని ఉన్నాయి. 1995లో పుట్టిన ఈ బ్యూటీ... 2011లో YG ఎంటర్‌టైన్‌మెంట్‌లో ట్రైనీగా చేరింది. 2015లో KBS2 డ్రామాలో... కామియో ఎప్పీరెన్స్‌లో కనిపించి... అందర్నీ అలరించింది. ఆ ఏడాది ఆమెకు ఎల్జీ, నికాన్ సహా చాలా కంపెనీల యాడ్స్ ఆఫర్లు దక్కాయి. 2016లో బ్లాక్ పింక్ గర్ల్ గ్రూప్‌లో చేరిన జిసూ... ఇక అప్పటి నుంచీ కెరీర్ గ్రాఫ్‌ని పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఆమె... సౌత్ కొరియాలో టాప్ 10లో నిలిచిన పాపులర్ సింగర్ అండ్ డాన్సర్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.96 కోట్ల మంది ఫాలోయర్లతో టాప్ టెన్ కె పాప్ ఐడల్స్‌లో చోటు సంపాదించుకుంది.