సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరేం చేసినా కూడా వెంటనే వైరల్ అయిపోతున్నాయి. అందులో కొన్ని మంచి ఉన్నాయి.. మరికొన్ని చూడలేని చండాలం కూడా ఉంటుంది. కొన్నిసార్లు హద్దులు మీరి చేసే పనులతో తలనొప్పులు తప్పవు. తమ స్థాయిని కూడా కిందకి దించేలా ఉండేలా ఆ పనులు అనవసరంగా విమర్శల పాలయ్యేలా చేస్తుంటాయి. ఇప్పుడు బుల్లితెర భామలు అరియానా, అషు రెడ్డి చేసిన పని ఇలాగే ఉంది.
వీళ్లు చేసిన పని చూసి ఇదేంట్రా నాయనా.. ఇలా రెచ్చిపోయారు అనిపించక మానదు. సోషల్ మీడియాలో కూడా దీనిపై రచ్చ జరుగుతుంది. అయినా ఇద్దరూ భామలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఇద్దరి బ్యాగ్రౌండ్ బిగ్ బాస్ తెలుగు. అక్కడ్నుంచే ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ వచ్చిన క్రేజ్ బుల్లితెరపై వాడుకుంటున్నారు అషు రెడ్డి, అరియానా. 2018లో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కలిసి నిర్మించిన 'ఛల్ మోహన్ రంగ' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అషు రెడ్డి.
అందులో నితిన్ హీరోగా నటించాడు. దానికి ముందు సోషల్ మీడియాలో ఈమెను జూనియర్ సమంత అంటూ నానా హంగామా చేసారు. అలాగే ఈమెకు 'బిగ్ బాస్3'లో అవకాశం వచ్చింది. ఒకప్పుడు సన్నగా ఉన్న అషు రెడ్డి.. ఆ తర్వాత బరువు పెరిగిపోయింది. అయితే ఫిజిక్ ఎలా ఉన్నా గ్లామర్ షో విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. మరోవైపు అరియానా కూడా అంతే.
చూడ్డానికి ఇలియానా చెల్లిలా సన్నగా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు మాత్రం పిట్ట కొంచెం కూత ఘనంలా ఉంటాయి. తాజాగా ఓ టీవీ షో ఈవెంట్ కోసం అషుతో కలిసి ఈమె చేసిన పనికి సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు నెటిజన్లు. బిగ్ బాస్ 4లో ఫైనలిస్టుగా నిలిచి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది అరియానా. ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చూపిస్తుంది.
పైగా గ్లామర్ యాంగిల్ కూడా భారీగానే ఉంది. తాజాగా అరియానా గ్లోరీ, అషు రెడ్డి ఓ ఛానల్ నిర్వహిస్తున్న స్పెషల్ షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే అరియానా నడుమును చూసిన అషు రెడ్డి.. వెంటనే ముద్దు పెట్టేసింది. అరియానా నడుముకు ముద్దు పెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా ఆ ఫోటోను అషునే తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది.
అషు రెడ్డి అలా తన నడుముకు ముద్దు పెడుతుంటే అరియానా కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆ సమయంలో అరియానా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చెప్తూ అషు రెడ్డి ఓ పోస్టు పెట్టింది. ఈ ఫోటో చూసిన వెంటనే నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇదెక్కడి చండాలంరా బాబూ మాకు అంటూ కామెంట్ చేస్తున్నారు. క్రియేటివిటీ హద్దులు దాటితే ఇదిగో ఇలాంటి పిచ్చి పనులే చేస్తారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.