Jr NTR: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించినట్టు .. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎపుడో పట్టాలెక్కాల్సిన కొరటాల శివతో ఎన్టీఆర్ మూవీ.. దాదాపు యేడాది గ్యాప్ తర్వాత ఎట్టకేలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఒకవేళ అంతా సాఫీగా సాగితే.. ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. ఏది ఏమైనా అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. (Twitter/Photo)
ఏది ఏమైనా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. అటు కొరటాల శివకు కూడా ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచే మొదలు కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీటైంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020,2021 కాలెండర్ ఇయర్లో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1235 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లతో పాటు రూ. 620 కోట్ల షేర్ రాబట్టింది. (Trivikram NTR/Twitter)
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. కొరటాల శివ ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రాన్ని స్వాతంత్య్రం తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేసారనే ఇతివృత్తంతో తెరకెక్కబోతున్నట్టు సమాచారం.దీనికి అసుర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.(Twitter/Photo)
ప్రశాంత్ నీల్, శంకర్ ప్రాజెక్ట్స్ తర్వాత ఎన్టీఆర్ అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మించనున్నట్టు సమాచారం..ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. (Twitter/Photo)
అటు ఎన్టీఆర్.. వరసగా ‘ఖైదీ’, ‘మాస్టర్’, విక్రమ్ వంటి సినిమాలతో సత్తా చూపెట్టిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగినట్టు సమాచారం. లోకేష్ కనగరాజ్.. ముందుగా రామ్ చరణ్ ప్రాజెక్ట్ టేకప్ చేశాకా.. వీళ్ల సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. (Twitter/Photo)
జూనియర్ ఎన్టీఆర్ అటు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో హిందీలో డైరెక్ట్ ఓ సినిమా చేయనున్నట్టు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయమై క్లారిటీ మాత్రం లేదు. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక నేపథ్యమున్న కథతోనే తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే ఈయన అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. (jr ntr sanjay leela bhansali)
మొత్తంగా ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువగా చారిత్రక నేపథ్యమున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ప్లాన్ చేయడం చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్.. ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటుకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ లెవల్లో మారు మ్రోగిపోయింది. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్తో వచ్చిన గ్యాప్‌ను వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో వస్తున్నారు. అందులో కొరటాల శివతో పాటు శంకర్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులున్నారు. (Jr NTR)