నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara) . ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ గెస్ట్‌గా వస్తున్నాడని.. అఫీషియల్‌గా కూడా మూవీ టీం ప్రకటించడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను అన్న కళ్యాన్ రామ్‌తో కలిసి వేదికపై చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అటు ఎన్టీఆర్ కూడా తర్వాత ఎలా ఉన్నాడో అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బింబిసారుడు అంటేనే మరణ శాసనం తో పాటు ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైనా బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు బాగున్నాయి.బార్బేయన్ కింగ్ బింబిసారుడు దాచి పెట్టిన నిధి సొంతం చేసుకోవడానికీ కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నుతాయి. వారి ఆటలను బింబిసారుడుగా మళ్లీ జన్మించిన కళ్యాణ్ రామ్ ఏ రకంగా అంతం చేసాడనేదే ఈ సినిమాగా కనబడుతోంది.
[caption id="attachment_1353846" align="alignnone" width="1600"] ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ గెటప్ బాగుంది. ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటోందో అని డైలాగులు పేలాయి. ‘ఎంత మంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.