ఎన్టీఆర్ వీరాభిమాని అయిన జనార్ధన్ అనే యువకుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్.. తన అభిమాని అమ్మ గారికి ఫోన్ చేసి మరి జనార్ధన్ ఆరోగ్యం విషయమై పరామర్శించారు. అంతేకాదు దేవుడి దయతో జనార్దన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.