Jr NTR | జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ అటు యాక్టింగ్ పరంగా.. ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా తిరుగులేని మాస్ హీరోగా సత్తా చూపెడుతున్నాడు. ఈ యేడాది ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్‌గా నటించి ప్యాన్ ఇండియా లెవల్లో అందరి అభిమానాన్ని చూరకొన్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించి కేక పుట్టిస్తున్నాడు. ఈ లుక్‌లో ఎన్టీఆర్ ఓ యాడ్ కూడా చేసారు. ఇప్పటికే కొరటాల శివ సినిమా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీటైంది. (Twitter/Photo)
ఎన్టీఆర్ సినిమా కోసం కొరటాల శివ .. ’దేవర’ సినిమాను రిజిస్టర్ చేయించాడట. ఇపుడీ టైటిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ .. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. ఏమైనా ఎన్టీఆర్‌కు ‘దేవర’ టైటిల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. (Photo Twitter)
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అనగానే.. ముందుగా వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా గుర్తుకు వస్తోంది. అందుకే వీళ్ల కాంబోలో రెండో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతా బాగుంటే.. ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి అంతా సిద్ధమైంది. ఇప్పట్లో ముహూర్తాలు లేవందున ఫిబ్రవరి మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై అపుడే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
ఇప్పటికే ఈయన తర్వాత సినిమాపై కన్ఫర్మేషన్ వచ్చింది. ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అధికారిక సమాచారం వచ్చినా కూడా.. ఆయన్ని కాదని కొరటాలతో సినిమా చేస్తున్నాడు తారక్. జనతా గ్యారేజ్ సినిమాతో ఆరేళ్ల కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు.
వాళ్లు కూడా ఇదే చెప్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసాడు కొరటాల శివ. మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.
కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా ఉన్నాడు. సినిమాను గతేడాది అనౌన్స్ చేసినపుడు ఎప్రిల్ 29, 2022న విడుదల చేస్తామని చెప్పారు కానీ ఇఫ్పటి వరకు షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు. కేవలం అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం. ఇక చిరంజీవి, రామ్ చరణ్.. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఆలస్యమైనట్టు సమాచారం.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా కథ కోసం బాగానే కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సెట్స్ కూడా రెడీ అయ్యాయని టాక్. దాంతో పాటు డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. పైగా ఆచార్య సినిమా ఎఫెక్ట్‌తో కొరటాల శివ పై ఒత్తిడి పెరగింది. ఇక కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌తో హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా బ్యాక్ బౌన్స్ అవ్వాలని చూస్తున్నారు. ఒక రకంగా కొరటాల శివకు ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఓ ఆయుధంలా దొరికాడు. మరి ఈ ఆయుధాన్ని కొరటాల శివ ఎలా ఉపయోగించి ప్రేక్షకులను మెప్పిస్తాడనేది చూడాలి.
ఇందులో తారక్ స్టూడెంట్ పొలిటికల్ లీడర్‌గా నటిస్తాడని తెలుస్తుంది. గతంలో నాగ సినిమాలో ఇలాంటి కారెక్టర్ చేసాడు జూనియర్. అయితే కొరటాల ట్రీట్మెంట్ మరోలా ఉంటుందని అందరికీ తెలుసు. ట్రిపుల్ ఆర్ తర్వాత కచ్చితంగా జూనియర్ ఇమేజ్ పాన్ ఇండియా వైడ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు.