ఈ నేపథ్యంలోనే RRR సినిమాను తెరకెక్కించి తెలుగోడి సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళికి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను మరో అవార్డు వరించింది. హాలీవుడ్లో ఎంతో ప్రెస్టిజియస్ అవార్డుగా భావించే ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (New York Film Critics Circle Award) అవార్డు ఈ చిత్రాన్ని వరించింది.
డేలీ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆన్లైన్ మీడియాకు సంబంధించిన ప్రముఖులు ఒక టీమ్‌గా ఏర్పటి 1935 నుంచి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికీ ఈ అవార్డు అందజేస్తూ వస్తోంది. తాజాగా ఈ యేడాది ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి ఈ అవార్డును అందజేసారు. ఈ సందర్భంగా రాజమౌళికి టాలీవుడ్ నుంచి భారతీయ సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.