గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత బింబిసార సినిమా ప్రీ రిలీజ్‌కి కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు అదే సీన్ అమిగోస్ సినిమాకు కూడా రిపీట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.