NTR - Ram Charan - Ravi Teja: రామ్ చరణ్ రూట్లో నిర్మాతలుగా మారుతున్న ఎన్టీఆర్, రవితేజ.. హీరోల కొత్త ఇన్నింగ్స్..

NTR - Ram Charan - Ravi Teja | ప్రస్తుతం తెలుగు హీరోలు కేవలం కథానాయకులుగానే కాకుండా.. నిర్మాతలుగా మారుతున్నారు. అంతేకాదు తమ అభిరుచికి తగ్గ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నిర్మాతగా తన తండ్రి చిరంజీవితో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. మహేష్ బాబు కూడా MB ప్రొడక్షన్ అంటూ తన బ్యానర్‌లో తెరకెక్కే సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కోవలోనే ఎన్టీఆర్, రవితేజ కూడా నిర్మాతలుగా లక్ పరీక్షించుకోబోతున్నారు.