జీవిత, రాజశేఖర్ దంపతులు రూ.26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జ్యో స్టార్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం ఆరోపణలు చేసిన తెలిసిందే. కాగా ఈ రోజు దీనిపై జీవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తనకు సమన్లు వచ్చిన విషయం నిజమేనని.. కానీ, తాను అరెస్ట్ కాలేదని తెలిపారు. దీనికి సంబంధించి ఏడాదికి పైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తోందని.. ఇంత కాలంగా ఈ కేసులు నడుస్తుంటే వారు మీడియా ముందుకు ఇప్పుడు ఎందుకు వచ్చారో అర్థం కాలేదని అన్నారు. Photo : Twitter
వివరాల్లోకి వెళితే.. గరుడ వేగ సినిమాకు డబ్బులు తీసుకుని దాటవేస్తున్నారని జ్యో స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమానులు హేమ, కోటేశ్వరరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జీవితా రాజశేఖర్‌పై నగరిలో కేసు నమోదైంది. గరుడ వేగ సినిమా కోసం ఆస్తులు తనఖా పెట్టి 26 కోట్ల రూపాయలు తీసుకుని తమకు తెలియకుండా తప్పుడు పత్రాలతో విక్రయించారని ఆరోపించారు. అంతేకాదు తమకు రావలసిన రూ. 26 కోట్లు రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. గరుడ వేగ సినిమాకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో రాజశేఖర్ దంపతులు అవకతవకలకు పాల్పడినట్లు ఆ సంస్థ ఆరోపణలు చేస్తోంది. Photo : Twitter
రాజశేఖర్ హీరోగా 2017లో గరుడవేగ (Garuda vega) చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నిఅందుకుంది. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న రాజశేఖర్‌కు కొత్త ఊపిరిని ఇచ్చింది. అయితే ఈసినిమాకు నిర్మాణ భాగస్వామిగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంది. దీంతో ఈ సినిమా నిర్మాణం కోసం జ్యో స్టార్ సంస్థ యజమాలు తమ ఆస్తులు అమ్మి డబ్బులు సమకూర్చామని.. అయితే ఆ తర్వాత మాకు రావలసిన డబ్బులు జీవితా రాజశేఖర్ దంపతులు చెల్లించలేదని ఆరోపించారు. Photo : Twitter
అంతేకాదు తమ ఆస్తుల్నీ బినామీ పేర్లకు మళ్లించి రాజశేఖర్, జీవితా దంపతులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇంకా మాట్లాడుతూ కొన్నాళ్లుగా జీవిత రాజశేఖర్ పై చెక్ బౌన్స్ కేసు నడుస్తోందని.. ఈ కేసులో రాజశేఖర్ జైలు వెళ్లడం ఖాయమని జ్యో స్టార్ సంస్థ పేర్కోంది. కాగా ఈ రోజు దీనిపై జీవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తనకు సమన్లు వచ్చిన విషయం నిజమేనని.. కానీ, తాను అరెస్ట్ కాలేదని తెలిపారు. దీనికి సంబంధించి ఏడాదికి పైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తోందని.. ఇంత కాలంగా ఈ కేసులు నడుస్తుంటే వారు మీడియా ముందుకు ఇప్పుడు ఎందుకు వచ్చారో అర్థం కాలేదని అన్నారు. .. Photo : Twitter
ఇక రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే.. కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక హీరోగా వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు రాజశేఖర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. Photo : Twitter
అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా ‘శేఖర్’ అనే కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా లుక్‌ను విడుదల చేసారు. ఈ సినిమాను లలిత్ అనే కొత్త దర్శకుడుతో ప్రారంభమైన జీవితా రాజశేఖర్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను వేరే నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద తనయ శివానీ రాజశేఖర్ .. ఆయన కూతురు పాత్రలో నటించడం విశేషం. Photo : Twitter
హీరోగా రాజశేఖర్‌కు 91వ సినిమా. ‘శేఖర్’ (Shekar) మూవీ మలయాళంలో హిట్టైన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ‘శేఖర్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. విడుదలైన ఈ గ్లింప్స్‌లో అరకుతో ఓ బంగ్లాలో ఓ వృద్ధ దంపతులను ఎవరో హత్య చేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్పటికే రిటైర్ అయిన శేఖర్ అనే పోలీస్ ఆఫీసర్ సాయం తీసుకుంటారు. ఈ సినిమాలో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. ఈ రోజు డాక్టర్ రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి కిన్నెర అంటూ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. Photo : Twitter
ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాశారు. అర్మాన్ మాలిక్ పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ముస్కాన్ కూబ్చాందిని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా మే 20న విడుదలకానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ సిగరెట్ వెలిగించి బుల్లెట్ బండిపై వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. Photo : Twitter
ఈ సినిమాతో ఈయన మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కు హిట్ అనేది కంపల్సరీ. ఈ సినిమా కోసం రాజశేఖర్ 60 యేళ్ల వయసులో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఔట్ పుట్ పై రాజశేఖర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడట. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. Photo : Twitter
రాజశేఖర్.. వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’ అనే టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఈ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ఈ సినిమాను కూడా రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter