సహజ నటి జయసుధ పేరు తెలియని సినీ ప్రేమికులు ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు హీరోయిన్గా ఎంత బిజీగా ఉండేవారో.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అంతే బిజీగా ఉంటూ వచ్చారు. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం వంటి చిత్రాలతో అమ్మగా జయసుధ మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. గత కొన్ని రోజులుగా తెరకు దూరంగా ఉంటూ వచ్చిన జయసుధ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఈ మధ్య జయసుధ చేసిన కామెంట్లు, కాస్టింగ్ కౌచ్ మీద ఆమె అభిప్రాయాలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
సీనియర్ నటిగా జయసుధకు మంచి ఇమేజ్ ఉంది. శోభన్ బాబు జయసుధ జోడికి తెలుగు నాట ప్రత్యేకంగా అభిమాన గణం ఉంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఎన్నో చిత్రాలు క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఇద్దరి జోడి తెరపై చూడటానికి ఎంతో ముచ్చటగా అనిపించేది. అప్పట్లో లవర్స్‌ను మీరేమైనా శోభన్ బాబు జయసుధ అని అనుకుంటున్నారా? అని అనేవాళ్లట. అంతలా ఈ జోడి జనాల మీద ప్రభావం చూపించింది.
ఇలా సీనియర్ నటీమణులను సుమ తన క్యాష్ షోకు తీసుకొచ్చింది. సుమ, సంఘవి, కుష్బూ, ఆమని వంటి వారితో సుమ తన క్యాష్ షోను వచ్చే వారం నడిపించబోతోంది. ఈ క్రమంలో వదిలిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో జయసుధకు ప్రత్యేకంగా సన్మానం చేశారు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా సత్కరించారు.
జయసుధ సినీ నటిగానే కాకుండా.. రాజకీయ నాయకురాలిగానూ ఫేమస్ అయింది. కాంగ్రెస్, బీజేపీ అంటూ జయసుధ బాగానే పార్టీలు కూడా మార్చేస్తోంది. జయసుధ తన కొడుకుని కూడా సినిమా రంగంలోకి తీసుకొచ్చింది. కానీ అదేమీ వర్కవుట్ అవ్వలేదు. ఇక జయసుధ కొడుకు పెళ్లి వేడుకలు, వాటికి సంబంధించిన ఫోటోలు ఆ మధ్య నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.