జయలలిత జీవితం ఒడిదుడుకులమయం.. ఎన్నో ఉత్తానపతనాలను చవిచూసింది.. మరెన్నో కష్టనష్టాలను అనుభవించింది. అయితే అన్నింటిని ధైర్యంతో ఎదుర్కొంది.. సినిమా హీరోయిన్ గా జీవితం ప్రారంభించి.. 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. ఆమె తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత.. ఈ రోజు పురుచ్చితలైవి జయలలిత జయంతి. (Twitter/Photo)
జయలలిత తల్లి పాత చిత్రాలలో ప్రముఖ నటిగా పేరు పొందారు. జయరాం తాతగారు మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పని చేశారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చెన్నై కేంద్రంగా ఉన్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. ఆ సమయంలో వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది. (Twitter/Photo)
చిన్నప్పటి నుంచే జయలలిత ప్రజ్ఞా పాటవాలు అపారం. చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్ లో జయ ప్రాథమిక విద్యను అభ్యసించింది. చదువులో జయలలిత ప్రతిభాపాటవాలను గుర్తించిన ప్రభుత్వం ఆమెకు స్కాలర్ షిప్ మంజూరుచేసింది. అయితే కుటుంబ పరిస్థితుల వలన జయ 15 వ ఏటనే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. తన తల్లి నటిస్తున్న చిత్రాలలో కూడా నటిస్తుండేంది. అయితే తన చదువుకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా దర్శకుల వద్ద ముందస్తుగా అనుమతి తీసుకునేది.
సినిమా ఇండస్ట్రీలో జయలలిత ఎన్నో విజయాలు సాధించారు. జయ నటించిన ఈపిస్ట్లీ అనే ఇంగ్లీషు చిత్రం 1961లో విడుదలైంది. జయ హీరోయిన్ గా కన్నడంలో మొట్టమొదట నటించిన చిత్రం చిన్నదా గంబి. 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. తెలుగులో వచ్చిన మనషులు మమతలు మూవీ జయకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 140 చిత్రాలలో నటించారు. ఆమె జాతీయ అవార్డ్ తోపాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయను కళైమామణి అవార్డుతో సత్కరించింది.(Twitter/Photo)
తమిళ రాజకీయాల్లో జయలలిత తనదైన ముద్ర వేశారు. జయ రాజకీయ ప్రవేశం విచిత్రంగా జరిగింది. 1977లో ఎంజీ రామ్ చంద్రన్ తమిళనాడు మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచ్చెందూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఏఐఏడీఎంకే తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు. పెద్దలసభలో ఏఐఏడీఎంకేకి ఓ విధమైన గుర్తింపు తీసుకువచ్చారు.(Twitter/Photo)
తెలుగులో పెద్ద ఎన్టీఆర్ తో జయమ్మ యాక్ట్ చేసిన సినిమాల గురించి సెపరేట్ గా చెప్నాల్సిన పనిలేదు. ‘కథానాయకుడు’ సినిమా నుంచి షురూ అయిన ఈళ్లిద్దరి కెమిస్ట్రీ.. .ఆ తర్వాత ‘ఆలీబాబా 40 దొంగలు’, ‘చిక్కడు దొరకడు’, ‘బాగ్ధాద్ గజదొంగ’, ‘గోపాలుడు భూపాలుడు’, తిక్క శంకరయ్య, ‘దేవుడు చేసిన మనుషులు’ ఇలా...దాదాపు డజను పైగా సినిమాల్లో వీళ్లిద్దరు కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
1987లో రామచంద్రన్ మరణించటంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. మెజార్టీ నాయకులు జానకీ రామచంద్రన్ కు మద్దతు ప్రకటించటంతో .. ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. (Twitter/Photo)
1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జయ పార్టీ 225 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో ఆమె ఆదాయానికి మించిని ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ కేవలం నాలుగు సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఓటమికి వెరవని జయలలిత..2001 ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి జయలలిత జీవితం పై పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ను గౌతమ్ మీనన్.. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. ఇపుడు కంగనా ప్రధాన పాత్రలో ‘తలైవి’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)