జయప్రద. ఒక తరం వారికి కలల రాణి. తెలుగు సినిమాలో హవా చూపించిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయింది.
తొలి దశ సినిమాలు, రాజకీయాలు అయ్యాక మళ్లీ వెండితెరవైపు అడుగులు వేసింది. తాజాగా, మరో నిర్ణయం తీసుకుంది.
65 ఏళ్ల వయసులో ఆమె మరోసారి మేకప్ వేసుకోనుంది. అది కూడా రాజేంద్ర ప్రసాద్‌తో తొలిసారి నటించనుంది. లవ్ @ 65 అనే సినిమా చేయనుంది.
ఇప్పటి వరకు ఏడు భాషల్లో నటించిన జయప్రద ఫస్ట్ టైమ్ పంజాబీ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది.
తనకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే శ్రీదేవి అని, తామిద్దరం సొంత అక్కాచెల్లెళ్లలా ఉండేవారిమని చెప్పింది.
తనకు నచ్చిన అత్యంత అందమైన హీరో శోభన్ బాబు అని జయప్రద తెలిపింది.
...