శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం
ఇక బోనీ కపూర్ ఆ మధ్య మాట్లాడుతూ.. మాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎంతో అభిమానం. ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటిన విషయాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మంచి కథ దొరికితే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జాన్వీ తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై ఉన్న అనుమానాలను పటా పంచలు చేసారు బోనీ కపూర్. ఈయన తెలుగులో అంతం, వకీల్ సాబ్ సహా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతన్నట్టు సమాచారం. (Twitter/Photo)
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. Photo : Instagram
అయినప్పటికీ... వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేకపోతున్న జాన్వీ... సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారును వెంట తిప్పుకుంటూనే ఉంది. రోజూ ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యాషనిస్టాస్ కూడా... జాన్వీని బాగానే వాడుకుంటున్నారు.. Photo : Instagram
Janhvi Kapoor : అది అలా ఉంటే జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చింది 2018లో.. చేసింది రెండు సినిమాలు మాత్రమే.. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఇదే టాపిక్ హాట్ హాట్‌గా నడుస్తుంది..Photo : Instagram
Janhvi Kapoor : జాన్వీ కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో ఉంది. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్ 7 జరిగిందని తెలుస్తుంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. Photo : Instagram
జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్‌లో పాగా వేసింది. తాజాగా జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో సౌత్‌లో నటించడానికి రెడీ అవుతోంది.(Twitter/Photo)