శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం. అందుకు తగ్గట్టే తెలుగులో ఎన్టీఆర్ మూవీతో ఎంట్రీ ఇవ్వడం విశేషం. (Instagram/Photo)
శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ఈమె తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. (Instagram/Photo)
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. రూహీతో గుడ్ లక్ జెర్రీ సినిమాలతో పలకరించింది. ఇందులో గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారమైంది. (Photo : Instagram)
రీసెంట్గా ‘మిలి’ సినిమాతో పలకరించింది. కానీ అంతగా ప్రేక్షకులకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. ఏది ఏమైనా జాన్వీకి వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేకపోతున్న జాన్వీ... సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారును వెంట తిప్పుకుంటూనే ఉంది. రోజూ ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యాషనిస్టాస్ కూడా... జాన్వీని బాగానే వాడుకుంటున్నారు.. Photo : Instagram
అది అలా ఉంటే జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చింది 2018లో.. చేసింది రెండు సినిమాలు మాత్రమే.. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఇదే టాపిక్ హాట్ హాట్‌గా నడుస్తుంది..Photo : Instagram
Janhvi Kapoor : జాన్వీ కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో ఉంది. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి రూ. 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. Photo : Instagram
జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్‌లో పాగా వేసింది. తాజాగా జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో సౌత్‌లో నటించడానికి రెడీ అవుతోంది.(Twitter/Photo)
ఇక అది అలా ఉంటే జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు.
ఇక ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీకపూర్ నిర్మాత. ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో.. Photo : Instagram