హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

జాన్వీ, బోనీ కపూర్ హోం క్వారంటైన్ పూర్తి..

జాన్వీ, బోనీ కపూర్ హోం క్వారంటైన్ పూర్తి..

బాలీవుడ్ అగ్ర నిర్మాత.. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే కుటుంబ సభ్యులకు కాదు కానీ ఆ ఇంట్లో పని చేసే వాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ ముగ్గురు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 14 రోజుల హోం క్వారంటైన్ తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించగా వీరందరికి నెగిటివ్ వచ్చింది. అంతేకాదు వీళ్లింట్లో పని చేసే వాళ్లకు కూడా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ ముగిసిన విషయాన్ని బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని కోరారు. అంతేకాదు కరోనాపై పోరులో విధుల్లో అంకిత భావంతో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారిశుధ్ధ కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

Top Stories