Janhvi Kapoor: బాలీవుడ్ యాక్టరస్ జాన్వీకపూర్ తన అప్‌కమింగ్ మూవీ గుడ్‌లక్ జెర్రీ ప్రమోషన్లో బీజీగా ఉంది. సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ చేస్తున్న ఫోటోషూట్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. కుర్రాళ్లకైతే కిర్రాకు పుట్టిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. అప్పుడెప్పుడో సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ తన లేటెస్ట్ మూవీ గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్ కోసం హాట్ హాట్ ఫోటోషూట్ చేసింది. (Photo :Instagram)
2/ 10
జాన్వీకపూర్ , దీపక్ దోబ్రియాల్ కాంబినేషన్లో తమిళ భాషలో హిట్టైన ‘కొలమావు కోకిల’ సినిమాను హిందీలో గుడ్ లక్ జెర్రీ పేరుతో లైకా ప్రొడక్షన్స్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, సన్ డయల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మించారు(Photo :Instagram).
3/ 10
ఆనంద్ ఎల్.రాయ్, సుభాస్కరణ్ నిర్మించగా సిద్ధార్థ్ సెంగుప్తా దర్శకత్వం వహించాడు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈసినిమాలో జాన్వీకపూర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించింది. ఈసినిమా వచ్చే నెల 29న రిలీజవుతోంది. (Photo :Instagram)
4/ 10
కరోనా సమయంలో షూటింగ్ మొదలు పెట్టి కరోనా అనంతరం పూర్తి చేసుకుంది గుడ్ లక్ జెర్రీ సినిమా. ఈమూవీ ప్రమోషన్ కోసం జాన్వీకపూర్ బ్లూ కలర్ స్లీవ్ లెస్ల టాప్, టోన్డ్ జీన్స్‌తో వీరలెవల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Photo :Instagram)
5/ 10
వచ్చే నెల 29న డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీలో గుడ్‌లక్ జెర్రీ రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులారిటీ సంపాధించుకుంది జాన్వీకపూర్. ఈ సినిమా ప్రమోషన్‌తో మరోసారి బుల్లితెరను షేక్ చేయబోతోంది. (Photo :Instagram)
6/ 10
సుశాంత్‌సింగ్, నీరజ్ సూద్ ఇతర ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. గుడ్ లక్ జెర్రీ సినిమాపై జాన్వీకపూర్ కోటి ఆశలు పెట్టుకుంది. ఈసినిమా రిలీజ్ ఆలస్యం కావడం వల్లే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. (Photo :Instagram)
7/ 10
ధడక్ సినిమాతో 2018లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆ సినిమా పర్లేదనిపించింది. ఆ తర్వాత 2020లో గుంజన్ సక్సెనాతో వచ్చింది. ఈ చిత్రం ఓటిటిలో విడుదలై.. పర్లేదనిపించింది. ఇక ఆ తర్వాత జోయా అక్తర్ ఘోస్ట్ సిరీస్‌లో కూడా కనిపించారు.(Photo :Instagram)
బాలీవుడ్లో హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ కంటే డబుల్ క్రేజ్ సొంతం చేసుకుంది జాన్వీకపూర్. ప్రస్తుతానికి బాలీవుడ్‌కే పరిమితమైన స్టార్ కిడ్..నెక్స్ట టాలీవుడ్లో అడుగుపెట్టబోతోందట. అప్పుడు అమ్మడి డిమాండ్ ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఫ్యాన్స్. (Photo :Instagram)
10/ 10
జాన్వీకపూర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జూనియర్ శ్రీదేవి ఫోటోలను చూస్తూ కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లైక్‌లు, కామెంట్లు షేర్ చేస్తున్నారు.(Photo :Instagram)