హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది యువ హీరోయిన్ జాన్వీ కపూర్. తన తల్లి దివంగత నటి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ నటనతో అందచందాల విషయంలో కూడా అదరగొడుతోంది. ఇక జాన్వీ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలై ఓకే అనిపించుకుంది. జాన్వీకి సౌత్ భాషాల్లో నటించాలనీ ఉందట. తన లేటెస్ట్ సినిమా మిలి ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. సౌత్ భాషల్లో నటించాలనీ ఉందని తెలిపింది.. Photo : Instagram
ఈ నేపథ్యంలో ఈ భామ ఇప్పటికే ఓ తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్గా మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అది అలా ఉంటే జాన్వీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. జాన్వీ తెలుగులో మరో సినిమాలో నటించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే జాన్వీ, కొరటాల ఎన్టీఆర్ సినిమాలో నటించనుందని సమాచారం.
క మందన్న, సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఎంత డిమాండ్ చేసిందన్నా విషయం ఇప్పటివరకు ఎవరూ వెల్లడించలేదు. అయితే రష్మిక మాత్రం ఈ సినిమా చేసేందుకు నాలుగు కోట్లు వరకు అడిగిందని గతంలో వార్తలు వచ్చాయి. మరి జాన్నీ ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు
మరోవైపు జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు. Photo : Instagram
ఇక ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీకపూర్ నిర్మాత. ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో.. Photo : Instagram
శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం Photo : Instagram