విజయ్ దేవరకొండ పెళ్లి గురించి షాకింగ్ విషయం చెప్పి ఆశ్చర్యపరిచింది జాన్వీ కపూర్. ఒకవేళ మీ స్వయంవరం జరిగితే.. ఏయే హీరోలు ఉండాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు బదులిస్తూ హృతిక్ రోషన్, రణ్ బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అని చెప్పింది జాన్వీ. మరి విజయ్ దేవరకొండ అని హోస్ట్ అడగ్గానే షాకింగ్ సమాధానం ఇచ్చింది జాన్వీ.
గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మిక మందన డేటింగ్ వ్యవహారం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ ఇద్దరూ కలిసి టూర్స్ వేస్తుండటం మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో జాన్వీ చేసిన ఈ ప్రాక్టీకల్ మ్యారేజ్ కామెంట్ వీళ్ళ డేటింగ్ గురించే అని చెప్పుకుంటున్నారు జనం.