సినిమా ఇండస్ట్రీకే అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి. అలాంటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి.. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లకు జన్మనిచ్చారు. అయితే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలనే కోరికతో ఉన్న ఆమె అనుకోకుండా దుబాయ్ లో కన్నుమూశారు.
రెస్టారెంట్లో బ్రెంచ్ చేస్తున్న ఫోటోను జాన్వీ పోస్టు చేసింది. ఈ పిక్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ కూతురు కూడా ఉంది. జాన్వీతో పాటు కాజోల్, అజయ్ దేవ్ గన్ ముద్దుల కూతురు నైసా దేవగన్ (Nysa Devgn) లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ గతంలో కూడా పార్టీలో దిగిన ఫోటోలు హల్ చల్ చేశాయి.
నైసా, జాన్వీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్లు తెలుస్తోంది వీరిద్దరు చాలా సందర్బాల్లో కలిసి పార్టీలు చేసుకున్నారు. జాన్వీ సినిమాల్లో బిజీగా ఉంటే... ఇటీవల, నైసా క FDCI X లాక్మే ఫ్యాషన్ వీక్ 2022లో కనిపించింది. ఈ ఫొటోల్లో నైసాతో జాన్వీ కపూర్ (Janhvikapoor) కూడా ఉంది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉండటం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు.