Priyanka Jain: మౌనరాగం సీరియల్లో తన హవభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్.. మాటలు రాని మూగ అమ్మాయి పాత్రలో జీవించేసి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకుంది. 'మౌనరాగం' సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ సినిమా హీరోయిన్. కన్నడలో ఓ సినిమాలో నటించిన ప్రియాంక జైన్, తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం అమ్ములు జానకిగా.. జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. సీరియల్లో ఎంతో పద్దతిగా సంప్రదాయంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి ఇప్పుడు చూద్దాం..