January To March Tollywood Box Office Report 2023: 2023లో అపుడే మూడు నెలలు గడిచిపోయాయి. ఈ 3 నెలల్లో అత్యంత కీలకమైన సంక్రాంతి సీజన్లో రెండు డైరెక్ట్ చిత్రాలు.. రెండు డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర లక్ పరీక్షించుకున్నాయి. అందులో బాలయ్య .. వీరిసింహారెడ్డితో పలకరిస్తే.. చిరంజీవి.. వాల్తేరు వీరయ్యతో దుమ్ము దులిపాడు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ‘రైటర్ పద్మభూషణ్’, సార్ చిత్రాలు విజయాలు సాధిస్తే.. మార్చి నెలలో ‘బలగం’ దాస్ కా దమ్కీ’, చివర్లో ‘దసరా’ మంచి టాకే సొంతం చేసుకుంది. మొత్తంగా 2023 మొదటి మూడు నెలల్లో ఎవరు విజేతలు.. ఎవరు పరాజితులనేది మీరు ఓ లుక్కేయండి.. (Twitter/Photo)
January Tollywood Box Office Report 2023: తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్’కు టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. సినిమా ఏమాత్రం బాగున్నా వసూళ్ల వర్షం కురుస్తుంది. 2021, 2022 కరోనా సమయంలో పెద్ద చిత్రాలు రిలీజ్ కాలేకపోయాయి. ఇక 2023 యేడాదిలో మాత్రం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి తో పాటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో పాటు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ మూవీలు రోజులు గ్యాప్‌లో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.
తెలుగులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా తమిళంలో హిట్ అనిపించుకుంది. రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇక్కడ రూ. 2.16 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 1.36 కోట్ల దూరంలో నిలిచింది. కానీ తమిళంలో మాత్రం రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా రూ. 101 కోట్ల షేర్ రాబట్టి తమిళంలో హిట్ స్టేటస్ అందుకుంది.
వీరసింహారెడ్డి | అటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’కి తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 80 కోట్ల షేర్ (రూ. 133 కోట్ల గ్రాస్) తో హిట్ స్టేటస్ అందుకుంది. (Twitter/Photo)
వాల్తేరు వీరయ్య | జనవరి 13న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తొలి రోజు నుంచి దుమ్ము దులుపుతూ సంక్రాంతి సీజన్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం .. ఇప్పటి వరకు రూ. 135కోట్లు షేర్ (రూ. 223.15 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 46 కోట్ల వరకు లాభాలను ఆర్జించింది. (Twitter/Photo)
ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ సవతి సోదరులుగా నటించారు. ఛిరంజీవి.. ఆంధ్ర వ్యక్తి పాత్రలో నటిస్తే..రవితేజ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి గా కనిపించారు. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా మంచి శుభారంభంతో పాటు 2023లో టాలీవుడ్లో తొలి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రంగా వాల్తేరు వీరయ్య నిలిచింది. (Twitter/Photo)
వారసుడు | జనవరి 11న తమిళంలో ‘వారిసు’తో పలకరించిన విజయ్.. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో రూ. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి రూ. 15.01 కోట్లు రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. (Twitter/Photo)
‘రైటర్ పద్మభూషణ్’ | ఫిబ్రవరి 3న విడుదలైన రైటర్ పద్మభూషణ్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా రూ. 6.45 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 4.45 కోట్ల లాభాలను తీసుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
అమిగోస్ | ఫిబ్రవరి 10న విడుదలైన.. నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘అమిగోస్’. డోపర్ గ్యాంగల్ అంటూ ఒకే రకంగా ఉండే ముగ్గురు వ్యక్తుల జీవితంతో తెరకెక్కిన ఈ మూవీకు టాక్ బాగనే వచ్చిన బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.45 కోట్ల షేర్‌ను 9.35 కోట్ల గ్రాస్‌ను అందుకుని డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 6.55 కోట్ల షేర్‌ను 11.70 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. కాగా ఈ సినిమా మొత్తం వాల్యూడ్ బిజినెస్ 11.30 కోట్లుగా ఉంది. దీంతో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 12 కోట్లుగా ఉంది. దీంతో ఈ సినిమా మొత్తం నష్టం 5.45 కోట్లుగా ఉండనుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
సార్ Sir | మార్చి 17న విడుదలైన ధనుశ్ హీరోగా నటించిన ‘సార్’ మూవీ మంచి టాక్‌తో తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. . తెలుగు రాష్ట్రాలు.. రూ. 38.60 కోట్లు గ్రాస్.. కర్ణాటక - రూ. 7.88 కోట్లు గ్రాస్ .. కేరళ -1.15 కోటి గ్రాస్. రెస్టాఫ్ భారత్ -1.18 కోట్లు గ్రాస్.. . ఓవర్సీస్ రూ. 24.05 కోట్ల గ్రాస్.. వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 57.89కోట్ల షేర్ (రూ. 111.31 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.
బలగం | మార్చి 3న విడుదలైన తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన హృద్యమైన చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘బలగం’ సినిమా. రూ. కోటి రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి.. నిర్మాతకు పదింతల లాభాలను తీసుకొచ్చి సంచలన విజయం సాధించి మార్చికి శుభారంభం ఇచ్చింది.
దాస్ కా దమ్కీ | మార్చి 22న ఉగాది కానుకగా విడుదలైన మూవీ ‘దాస్ కా దమ్కీ’. విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా దమ్కీ’ ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరో కమ్ విలన్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
దసరా | నాని హీరోగా కీర్తి సురేష్ కథానాయికగా నటించిన మూవీ ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నాని కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందనేది చూడాలి. (File/Photo)
మొత్తంగా టాలీవుడ్ మూడు నెలల్లో యావరేజ్‌గా నెలకు మూడేసి హిట్స్ చొప్పున మంచి ఊపుమీదనే ఉంది.ఈ 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ, ‘బలగం’ దాస్ కా దమ్కీ,దసరా సహా మొత్తంగా 9 సినిమాలు హిట్స్ గా నిలిచాయి. ఓవరాల్‌గా 2023లో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మంచి ఊపు ఇచ్చిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఊపు కంటిన్యూ కావాలని కోరుకుందాం.. (Twitter/Photo)