అవతార్ సీక్వెల్స్ పై అఫీషియల్ ప్రకటన చేసిన జేమ్స్ కామెరూన్..
అవతార్ సీక్వెల్స్ పై అఫీషియల్ ప్రకటన చేసిన జేమ్స్ కామెరూన్..
హాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ సినీ పరిశ్రమను ‘అవతార్’ సినిమాతో మాయ చేసాడు జేమ్స్ కామెరూన్. తాజాగా ఈయన ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. దాంతో మూడు, నాలుగు, ఐదు సీక్వెల్స్‌కు తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించమే కాదు. రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు.
1/ 11
కెనడియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’ ఎన్నో సంచనాలు నమోదు చేసింది. (Twitter/Photo)
2/ 11
ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన సీక్వెల్ ‘అవతార్ 2’ షూటింగ్‌ను న్యూజిలాండ్ దేశంలో ప్రారంభించాడు. (Twitter/Photo)
3/ 11
అవతార్ 2 సినిమాను 17 డిసెంబర్ 2021లో విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు జేమ్స్ కామెరూన్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను 16 డిసెంబర్ 2022లో విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. (Twitter/Photo)
4/ 11
అవతార్-2తో సీక్వెల్ కాకుండా ఆ తర్వాత అవతార్-3, అవతార్-4, అవతార్ 5 సినిమాలు కూడా తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
5/ 11
‘అవతార్’ సినిమాను సంబంధించిన సీక్వెల్స్‌ను డిస్నీ సంస్థ నిర్మిస్తోంది. (Twitter/Photo)
6/ 11
అవతార్ 3 సీక్వెల్‌ను కూడా 20 డిసెంబర్ 2024లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
7/ 11
2026 డిసెంబర్ 18 ‘అవతార్ 4’ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
8/ 11
‘అవతార్ 5’ సినిమాను 22 డిసెంబర్ 2028 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా వరుసగా ఐదు సీక్వెల్స్‌ను ప్రకటించడమే కాదు. వాటికి సంబంధించిన రిలీజ్ డేట్స్ ను కూడా ప్రకటించడం విశేషం. (Twitter/Photo)
9/ 11
‘అవతార్’ సీక్వెల్స్‌కు సంబంధించిన అన్ని స్క్రిప్ట్ వర్క్ ఎపుడో పూర్తి చేసిన జేమ్స్ కామెరూన్ (Twitter/Photo)
10/ 11
’అవతార్ 2’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)
11/ 11
న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లండులోని యూనివర్సల్ స్టూడియో ’అవతార్ 2’ సంబంధించిన షూటింగ్ పూర్తి చేయనున్నారు. (Twitter/Photo)