అతడు చేసే అడ్వెంచర్లకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. రహస్యాలను ఛేదించడంలో అతడికతడే సాటి. ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడంటే ఆడియన్స్ లో నరాలు తెగే ఉత్కంఠ.అతడే బాండ్..జేమ్స్ బాండ్. గత 50 యేళ్లక పైగా వెండితెరపై జేమ్స్ బాండ్ అనే పాత్ర ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఈ సందర్బంగా న్యూస్ 18 స్పెషల్ ఫోకస్.. (Twitter/Photo)
బాండ్ మూవీస్ కు డాక్టర్ నో అనే నవలకూ లింకుంది. ఆ నవల్లోని పాత్రే 50ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక నావల్ కేరెక్టర్ వాల్డ్ వైడ్ గా ఇంత పాపులర్ కావడం గ్రేట్ గా చెప్పాలి. ఆ తర్వాత కూడా ఎన్నో పాత్రలు ఆడియన్స్ ముందుకు పదే పదే వచ్చాయిగానీ బాండ్ వాటన్నిటిలోకి మోస్ట్ పాపులర్. ఇందులో హీరో కు అతీతశక్తులేం వుండవు. జస్ట్ అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి అసలైన హీరో అనిపించుకుంటాడు అంతే. (File/Photo)
1962లో వచ్చిన డాక్టర్ నో ది ఫస్ట్ బ్రిటీష్ స్పై ఫిల్మ్. ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా ఇదే. 1958లో ఇదే పేరున ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన నవలాధారంగా వచ్చిన చిత్రమిది. Terence Young డైరెక్ట్ చేయగా..Harry Saltzman, Albert R. Broccoliలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ నటించారు. అతనికి జోడీగా ఉర్సులా అండర్సన్ హాట్ హాట్ గా యాక్ట్ చేసి, ఆడియన్స్ కు స్వీట్ స్వీట్ గా షాకులిచ్చింది. అక్కడి నుంచి బ్రాండ్ మూవీ పరంపర నాన్ స్టాప్ గా కొనసాగుతూనే వుంది. (File/Photo)
ఫస్ట్ బాండ్ మూవీలో డాక్టర్ నోలో సీన్ కానరీ సూపర్బ్ గా యాక్ట్ చేయడంతో.. అక్కడి నుంచీ బాండ్ పాత్రకు ఆయన పేరే వినిపించింది. మధ్యలో ఆన్ హర్ మాజిస్టీస్ సీక్రెట్ సర్వీస్ లో జార్జ్ లాజెన్బీ బాండ్ గా యాక్ట్ చేసాడు. ఆ ఒక్క సినిమా తప్పించి ఆ మధ్య కాలంలో వచ్చిన అన్ని బాండ్ సినిమాలకూ హీరో కానరీనే. ఇక డాక్టర్ నో , ఫ్రమ్ రష్యా విత్ లవ్ రెండు సినిమాలను కలిపి సూపర్ స్టార్ కృష్ణ ‘గూఢచారి 116’ సినిమా చేశారు. (Twitter/Photo)
ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్ బాల్, యు ఓన్లీ లైవ్ ట్వైన్, డైమండ్స్ ఆర్ ఫరెవర్.. ఇలా కానరీ తొమ్మిదేళ్ల పాటూ ప్రేక్షకులను మెప్పించారు.. తన 32ఏట బాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కానరీ.. 41 ఏట వరకూ యాక్ట్ చేసి శెభాష్ అనిపించారు. స్కాటిష్ నటుడైన సీన్ కానరీ కొన్ని దశాబ్దాల పాటు యాక్ట్ చేశారు. The Untouchables సినిమాలో నటనకు గాను ఆయన 1988లో ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు.(File/Photo)
ఫస్ట్ జేమ్స్ బాండ్ ‘సీన్ కానరీ’ బ్రేక్ తీసుకున్నాకా.. తెరపైకి కొత్త జేమ్స్ బాండ్ ఎవరా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. నిర్మాతలు ఆస్ట్రేలియా మోడల్ జార్జ్ లాజేన్బీతో బాండ్ సినిమాను తెరకెక్కించారు. ఈయన ‘ఆన్ హర్ మాజేస్టీ సీక్రెట్ సర్వీస్’ అనే ఒకే ఒక్క బాండ్ చిత్రంలో కనిపించారు. అంతకు ముందు సీన్ కానీరిని చూసిన ప్రేక్షకులకు ఈయన నటన అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ సీన్ కానరీ రంగంలోకి దిగారు. (File/Photo)
మన నాటకరంగంలో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అంటుంటారు. అలా ఒకటో బాండ్ గా సీన్ కానరీ లా రెండు మూడు అంటూ చాలామంది బాండ్ హీరోలున్నారు. సీన్ కానరీ తర్వాత బాండ్ హీరోగా ఎక్కువ సినిమాలు చేసిన హీరో రికార్డు రోజర్ మూర్ పేరిట వుంది. రోజర్ మూర్ 12ఏళ్ల పాటూ బాండ్ గా ఏడు సినిమాల్లో యాక్ట్ చేశారు. ఫస్ట్ సినిమా లైవ్ అండ్ లెట్ డై చేసేనాటికే మూర్ ఏజ్ 45. (Twitter/Photo)
ఈ మూవీ తర్వాత వచ్చిన ది మాన్ విత్ ద గోల్డన్ గన్, ది స్పై హూ లవ్డ్ మీ, మూన్ రేకర్, ఫర్ యువర్ ఐస్ ఓన్లీ, ఆక్టోపస్సీ, ఏ వ్యూటూ ఏ కిల్.. ఆయన ఖాతాలోనివే. అలా రోజర్ మూర్ బాండ్ గా తన 58వ ఏట వరకూ నటిస్తూనే వచ్చారు. ఓల్డెస్ట్ అండ్ లాంగెస్ట్ బాండ్ కెరీర్ నడిపింది రోజర్ మూర్ కావడం విశేషం. రోజర్ మూర్ బాండ్ గా చేసిన చిత్రాల్లోకెల్లా మూన్ రేకర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.. 1979లోLewis Gilbert డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్స్ లో 200మిలియన్ మార్క్ దాటింది. ఇయాన్ ఫ్లెమింగ్ ఇదే పేరున రాసిన నవల ఆధారంగా మూన్ రేకర్ తెరకెక్కింది. Lois Chiles బాండ్ గాళ్ గా యాక్ట్ చేసి మెప్పించింది.ఈ చిత్రాన్ని తెలుగులో కృష్ణ ‘రహస్య గుఢచారి’గా కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. (File/Photo)
హాలీవుడ్ సినిమాలు అమెరికాకు చెందినవి. బాండ్ మూవీస్ బ్రిటీష్ కు చెందినవి. హాలీవుడ్ సినిమాలన్నీ ఒకఎత్తైతే వాటితో సమానంగా వాల్డ్ వైడ్ గా అట్రాక్ట్ చేసిన బాండ్ మూవీస్ ఒక ఎత్తు. వాల్డ్ సిల్వర్ స్క్రీన్ మీద బాండ్ ఒక బ్రాండ్ గా మారిపోయారు. ఆ సినిమాలో యాక్ట్ చేయడం ఓ డ్రీమ్. బాండ్ గా యాక్ట్ చెయ్యడం ఓ ప్రిస్టేజ్. ముఖ్యంగా టాప్ మోస్ట్ బ్రిటీష్ యాక్టర్ అనిపించుకోవాలంటే బాండ్ గా తెరపై కనిపిస్తే చాలు.. ఆటోమేటిగ్గా ఆ క్రేజ్ వచ్చేస్తుంది.రోజర్ మూర్ తర్వాత బాండ్ గా అలరించిన వారిలో తిమోతి డాల్టన్ పేరు వినిపిస్తుంది. ఈయన చిన్న వయసులోనే బాండ్ గా యాక్ట్ చేయాలని ట్రై చేసి ఫెయిలయ్యారు. మూర్ తర్వాత వచ్చిన 1987లో వచ్చిన ది లివింగ్ డే లైట్స్, 1989లో రిలీజైన లైసెన్స్ టూ కిల్ చిత్రాల్లో తిమోతీ బాండ్ హీరోగా నటించి మెప్పించారు. (File/Photo)
’లైసెన్స్ టూ కిల్’ తర్వాత బాండ్ సినిమాలకు భారీ బ్రేకులు పడ్డాయి. సుమారు ఆరేళ్ల పాటూ బాండ్ మూవీస్ రిలీజ్ కాలేదు. 1995లో న్యూ బాండ్ గా ఐరిష్ యాక్టర్ పియర్స్ బ్రాస్నన్ తెరపైకి వచ్చారు. ‘గోల్డన్ ఐ’ పేరిట రిలీజైన ఈ మూవీ Martin Campbell డైరెక్ట్ చేశారు. బాండ్ గాళ్ గా Izabella Scorupco మాయలు చేసింది. గోల్డెన్ ఐ పేరుకు తగ్గట్టుగానే350 మిలియన్ డాలర్ల భారీ కలెక్షన్లు సాధించింది. ఆ ఏడాది వాల్డ్ వైడ్ హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. (File/Photo)
సీన్ కానరీ, రోజర్ మూర్ల తర్వాత వరుస పెట్టున బాండ్ మూవీస్ చేసిన హీరోగా పియర్స్ బ్రాస్నన్ పేరు సాధించారు. గోల్డన్ ఐతో పాటు.. టుమారో నెవర్ డై, ది వాల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, డై అనదర్ డే చిత్రాల్లో నటించి మెప్పించారు. వీటిలో 2002లో రిలీజైన డై అనదర్ డే.. అప్పటి వరకూ వచ్చిన బాండ్ మూవీస్ లోకెల్లా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో బ్రాస్నన్ సరసన హాటెస్ట్ యాక్ట్రెస్ హాలీబెర్రీ బాండ్ గాళ్ గా నటించింది. (File/Photo)
బాండ్ అంటే అదో స్టైల్. బాండ్ అంటే అదో వండర్.బాండ్ అంటే అదో సపరేట్ మానియా. సిల్వర్ స్క్రీన్ మీద బాండ్ చేసే అడ్వెంచర్లు చూడ్డానికి రెండు కళ్లు చాలవని ఫీలవుతారు ప్రేక్షకులు. బాండ్.. సినిమాల్లో నటించడం ఓ క్రేజ్. ఈ మూవీస్ లో ఓ చిన్న పాత్ర వేసినా కావలసినంత పబ్లిసిటీ. అదే బాండ్ వాల్యూను అమాంతం పెంచేసింది. సినిమా చూస్తుంన్నంత సేపూ రెండు కళ్లూ చాలవు.పియర్స్ బ్రాస్నన్ డై అనదర్ డే యాక్ట్ చేసి బాండ్ పాత్రలనుంచి రిటైర్ అయ్యారు. ఆయన తర్వాత ఆరో బాండ్ హీరోగా డేనియల్ గ్రేగ్ ఎంట్రీ ఇచ్చారు. (Twitter/Photo)
గత నాలుగు చిత్రాలుగా బాండ్ గా డెనియలే చేస్తూ వస్తున్నారు. బాండ్ హీరోగా డేనియల్ నటించిన ఫస్ట్ మూవీ..2006 లో వచ్చినకాసినో రాయల్. ఇది బాండ్ మూవీస్ లో 21వ సినిమా. 150మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అంతే స్థాయిలో 600మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. Martin Campbell డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాండ్ గాళ్ గా ఇవా గ్రీన్ నటించింది. మెట్రో గోల్డ్ విన్ మేయర్, కొలంబియా పిక్చర్స్ వారి డిస్ట్రిబ్యూషన్లో వచ్చింది. (file/photo)
డేనియల్ గ్రేగ్ హీరోగా వచ్చిన 22వ బాండ్ సినిమా క్వాంటమ్ ఆఫ్ సోలెస్. Marc Forster డైరెక్షన్లో.. 200 మిలియన్ డాలర్ల బడ్జెక్ట్ తో తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమాలో బాండ్ గాళ్ గా నెంబర్ వన్ హాటెస్ట్ యాక్ట్రెస్ Olga Kurylenko నటించింది. ఇది కూడా మెట్రో గోల్డ్ విన్ మేయర్, కొలంబియా పిక్చర్స్ వారి డిస్ట్రిబ్యూషన్లో వచ్చింది. (Instagram/Photo)
ఇపుడీ సిరీస్‌లో 25వ సినిమాగా ‘నో టైమ్ టూ డై’ సినిమా తెరకెక్కింది. డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్‌గా నటిస్తోన్న 5వ సినిమా. ఈ సినిమా తర్వాత డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ చిత్రాల నుంచి రిటైర్ కానున్నట్టు ప్రకటించారు. దాదాపు 15 యేళ్లుగా ఈయన బాండ్‌గా అలరిస్తూనే ఉన్నారు. సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. Photo : Twitter