జగపతి బాబు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన .. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ సినిమా విలన్‌గా జగపతి బాబు కెరీర్‌ను టర్న్ చేసింది. తాజాగా ఈయన బాలీవుడ్లో విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. (Twitter/Photo)
జగపతిబాబు: ఒకప్పటి ఈ హీరో ఇప్పుడు విలన్‌గా బిజీ అయ్యాడు. మధ్యలో కారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తున్నాడు. ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్నాడు జగపతిబాబు.ఇక అరవింద సమేత వీరరాఘవలో ఈయన నటనను ఎవరు మరిచిపోలేరు. ఇప్పటికే జగపతిబాబు విలన్‌గా తమిళం, మలయాళం, కన్నడలో నటించారు. ఇపుడు బాలీవుడ్లో ఫర్హాన్ అక్తర్ మూవీలో విలన్‌గా నటించాడానికి ఓకే చెప్పారు. గతంలో ‘తానాజీ’లో అవకాశం వచ్చినా.. డేట్స్ అడ్జస్ట్ కాక ఆ సినిమాలో అవకాశం ఒదులుకున్నారు జగ్గూ భాయ్. (Twitter/Photo)
అంతేకాదు జగ్గూ భాయ్.. ప్రభాస్ ‘సలార్’లో రాజమన్నార్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జగపతి బాబు పాత్రకు సంబంధించిన లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాతో జగపతి బాబు ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నారు. జగపతి బాబు కంటే బీటౌన్‌లో నటించిన సౌత్ హీరోల విషయానికొస్తే.. (Twitter/Photo)
బెల్లంకొండ హీరోగా బాలీవుడ్ ‘చత్రపతి’ రీమేక్‌కు క్లాప్ కొట్టిన రాజమౌళి. ప్రభాస్ ఛత్రపతి సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో వివి వినాయక్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హీరోగా.. దర్శకుడిగా బెల్లంకొండకు వినాయక్‌కు ఇదే ఫస్ట్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ. మరి బాలీవుడ్ ఛత్రపతిగా బెల్లంకొండ ఈ సినిమాలో ఏ రేంజ్లో అలరిస్తాడో చూడాలి. (Twitter/Photo)
ప్రభాస్ విషయానికొస్తే.... ‘బాహుబలి’ అనే రీజనల్ తెలుగు సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ‘సాహో’ తో బాలీవుడ్లో సత్తా చాటిన ప్రభాస్.. ఇపుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే డైరెక్ట్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకు ముందు ప్రభాస్ .. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కిన ‘యాక్షన్ జాక్సన్’ అనే హిందీ సినిమాలో అతిథి పాత్రలో మెరిసారు. (Instagram/Photo)
ప్రభాస్ ఆది పురుష్ విషయానికొస్తే.. ఈ సినిమాను రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఇప్పటకే ఈ సినిమా షూటింగ్ ముంబాయిలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైయింది. ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు ప్రభాస్ ప్రతి చిత్రం ఇపుడు ఆల్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీలో విడుదల కానున్నాయి. (adipurush prabhas)
కెరీర్ మంచి స్పీడ్ మీదున్నప్పుడే.. హిందీ సినిమాల్లో నటించి.. ఓ లెవెల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా హిందీ రీమేక్ ‘శివ’ మూవీతో బాలీవుడ్ ఆడియెన్స్ కు ఇంట్రడ్యూసయ్యాడు నాగార్జున. అప్పటికే..టాలీవుడ్ లో దాదాపు 20 సినిమాల్లో యాక్ట్ చేసారు నాగ్. ఆ తర్వాత 1992 లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి.. ‘ఖుదాగవా’ సినిమాలో నటించాడు నాగ్. (Twitter/Photo)
టాలీవుడ్ హీరోలందరిలో ఎక్కువ బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసింది కూడా నాగ్ కావడం విశేషం. ‘శివ’, ఖుదాగవా’ తర్వాత నాగ్.. హందీలో ‘మిస్టర్ బేచారా’, క్రిమినల్, ద్రోహి,ఎల్.ఓ.సి, అంగారే, అగ్నివర్ష’ త్వరలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో పలకరించనున్నాడు. మొత్తం 10కి పైగా హిందీ సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసారు నాగార్జున. (Twitter/Photo) (Image; @starmaa)
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన.. గ్యాంగ్ లీడర్ సినిమాను.. హిందీలో ఆజ్ కా గూండారాజ్ టైటిల్ తో రీమేక్ చేసాడు చిరంజీవి. అక్కడ కూడా భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఇక బాలీవుడ్ లో చిరంజీవి థార్డ్ అండ్ ఫైనల్ మూవీ.. ది జెంటల్మెన్. ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ లో ఎక్స్ పెరిమెంట్ చేయకుండా .. అక్కడితో అపేసారు.. చిరు. టోటల్‌గా హిందీలో మెగాస్టార్ చేసినవి రీమేక్స్ కావడం విశేషం. (Twitter/Photo)
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ తొలిసారి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్ హిందీ చిత్రం కాదు. కానీ అల్లు అర్జున్ బాలీవుడ్లో నటిస్తే చూడాలకునే ప్రేక్షకులున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. (pushpa movie)
చాలా కాలం పాటు.. సౌత్ కే పరిమితమైన కోలీవుడ్ సూపర్ స్టార్ .. రజినీ కాంత్. కావల్సినంత ఇమేజ్ ఉన్నా..కొన్నేళ్ల వరకూ బాలీవుడ్ వైపు అడుగు వేయలేదు. 1983 లో అంధా కానూన్ సినిమాతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడీ సూపర్ స్టార్. తనకున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి.. బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయడం కంటిన్యూ చేసాడు.. రజనీకాంత్. అలా బాలీవుడ్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడీ హీరో.(Twitter/Photo)
కెరీర్ స్టార్టింగ్ లోనే హిందీ సినిమాలో నటించి.. మొదట్నుంచీ.. బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. హిందీ లో కమల్ ఫప్ట్ మూవీ *ఏక్ దూజేకే లియే@. తెలుగులో హిట్ అయిన మరో చరిత్రకు రీమేక్. కెరీర్లో ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన కమల్.. కేవలం సౌత్ స్టార్ అని ముద్రవేయలేం. అందుకే అతన్ని ఇండియన్ స్టార్ హీరో అంటారు.(Twitter/Photo)
అపరిచితుడు ఫేమ్ చియాన్ విక్రమ్ కూడా.. బాలీవుడ్ లో తన అదృష్టానికి పరీక్ష పెట్టాడు. అభిషేక్ బచ్చన్ తో ఈక్వల్ రోల్ ప్లే చేసిన రావన్ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ సినిమాలో సోలో హీరోగా నటించాడు విక్రమ్. అయితే ఆ మూవీ కూడా ఫెయిల్యూర్ గా నిలిచి.. విక్రమ్ బాలీవుడ్ బాటకు అడ్డంకులు సృష్టించింది.(Twitter/Photo)
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన హీరో కమ్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్.. ప్రభుదేవా. ఈ టాలెంటెడ్ మల్టీ పర్సనాలిటీ అప్పుడప్పుడూ.. స్పెషల్ అప్పియరెన్స్ లతో బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. గత రెండు మూడేళ్లుగా ఈ హీరో.. డైరెక్టర్ గా బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ‘ఏబిసిడీ’ మూవీలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి ఆడియెన్స్ ను అలరించాడు. (Twitter/Photo)
పృథ్వీ.. మలయాళి యంగ్ స్టార్ హీరో. మాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరో.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ లో 100కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన పృథ్వీ.. ‘అయ్యా ’మూవీతో హిందీ సినిమాల్లో తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత ఔరంగజేబ్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాల్లోనటించాడు. (Twitter/Photo)