ఇక, లేటెస్ట్ ఫొటోల్లో స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతోంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి అందాల విధ్వంసంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. బాలీవుడ్లో బిగ్ స్టార్స్‌తో యాక్ట్ చేసిన ఈ శ్రీలంక బ్యూటీ ఇప్పుడు ఫ్లోరల్ చీరలో అలరించింది. ఈ శారీలో శ్రీలంకన్ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.(Image Credit : Instagram)
ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఇన్ స్టాలో దాదాపుగా 62 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రేంజ్ లో జాక్వెలిన్ కు ఫాలోవర్స్ ఉండటం మాములూ విషయం కాదు. తన లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసిన హాఫ్ డేలోనే లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది.ఈమెకు సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 64.2మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈమె అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ మూవీలో పలకరించింది. ఈ సినిమాకు మంచి వసూళ్లను సాధించింది. త్వరలో రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కస్’ మూవీతో పలకరించనుంది. (Image Credit : Instagram)
తాత్కాలిక బెయిల్‌పై ఉన్న ఆమె.. తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ కోసం లాయర్ ప్రశాంత్ పాటిల్‌తో కలిసి కోర్టుకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు ఆమె తాత్కాలిక బెయిల్ గడువును నవంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది.అదేవిధంగా జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా నవంబర్ 10న జరపనున్నట్లు తెలిపింది.(Photo:Instagram)
తాత్కాలిక బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్ ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఆమె ఏడు కోట్ల రూపాయల విలువైన వస్తువులను గిఫ్ట్‌లుగా అందుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. అందుకే ఆమెకు చెందిన రూ.7 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కానీ, జాక్వెలిన్ మాత్రం ఆ సొమ్ము తన కష్టార్జితమని చెబుతున్నది.(Photo:Instagram)
ప్రస్తుతం ఆమె తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు. బెయిల్ ముగుస్తున్న నేపథ్యంలో ఆమె తన లాయర్ ప్రశాంత్ పాటిల్ తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ ను విచారించిన కోర్టు... రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 10వ తేదీన విచారిస్తామని... అప్పటి వరకు తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. దీంతో ఆమెకు స్వల్ప ఊరట లభించినట్టయింది.(Photo:Instagram)