JACQUELINE FERNANDEZ OUT FROM AKKINENI NAGARJUNA NEW FILM SONAL CHAUHAN WILL BE IN AK
Jacqueline Fernandez: పాపం.. జాక్వెలిన్‌కు దెబ్బ మీద దెబ్బ.. నాగార్జున కూడా హ్యాండ్ ఇచ్చేశాడా ?
Jacqueline Fernandez: జాక్వెలిన్ చుట్టూ వివాదాలు తలెత్తడంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారని సమాచారం. సుఖేష్ చంద్రశేఖర్‌పై రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెరపైకి వచ్చింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఇరుకున్న తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఈ కేసు ప్రభావం ఆమె మీద కూడా పడిందనే చర్చ జరుగుతోంది. సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధాల తరువాత జాక్వెలిన్ మరో రకంగా వార్తల్లో నిలుస్తోంది.
2/ 7
అయితే తాజాగా నాగార్జున నయా మూవీ ది ఘోస్ట్లోనూ జాక్వెలిన్‌ను తొలగించారని సమాచారం. జాక్వెలిన్ స్థానంలో సోనాల్ చౌహాన్‌ను ఈ సినిమాలో తీసుకున్నారని టాక్. ఎంపికైనట్లు సమాచారం. అదేంటంటే.. ఇప్పుడు నాగార్జునతో కలిసి లీడ్ రోల్ లో కనిపించనుంది.
3/ 7
ఈ సమాచారం తెలుసుకున్న సోనాల్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో ముందుగా కాజల్‌ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది.
4/ 7
దీంతో దర్శకనిర్మాతలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈ నయా మూవీ కోసం ఎంపిక చేశారు. త్వరలోనే జాక్వెలిన్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో జాక్వెలిన్ లేదని తెలుస్తోంది.
5/ 7
జాక్వెలిన్ చుట్టూ వివాదాలు తలెత్తడంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారని సమాచారం. సుఖేష్ చంద్రశేఖర్‌పై రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెరపైకి వచ్చింది.
6/ 7
అప్పటి నుంచి జాక్వెలిన్ వివాదాల్లో చిక్కుకుంది. ఈడీ విచారణ సందర్భంగా జాక్వెలిన్ సుకేష్‌తో డేటింగ్ చేస్తోందని.. వాళ్లు కలిసి ఉన్నప్పుడు సుఖేష్ ఆమెకు ఎన్నో బహుమతులు ఇచ్చాడని వెల్లడైంది.
7/ 7
ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందుల్లో ఉన్న జాక్వెలిన్ తదుపరి కిక్ 2, రామ్ సేతు, బచ్చన్ పాండే, సర్కస్‌లో కనిపిస్తుంది.