Jabardasth Varsha: అతను కాదంటే చచ్చిపోతా..! లవ్ ఎఫైర్‌పై వర్ష షాకింగ్ రియాక్షన్
Jabardasth Varsha: అతను కాదంటే చచ్చిపోతా..! లవ్ ఎఫైర్‌పై వర్ష షాకింగ్ రియాక్షన్
Varsha Emmanuel Love Track: చాలా సార్లు రొమాంటిక్ సాంగ్స్‌పై డాన్సులేసి తమ మధ్య కెమిస్ట్రీ ఎంత బలంగా ఉందో నిరూపించారు ఇమ్ము వర్ష. వీళ్ళ చేష్టలతో ఈ ఇద్దరిపై జనాల్లో అనుమానాలు ముదిరాయి. తాజాగా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది వర్ష.
ప్రస్తుతం జబర్దస్త్ వేదికపై బాగా డిమాండ్ ఉన్న జోడీ ఇమ్మానుయేల్- వర్ష. సుడిగాలి సుధీర్- రష్మీ జోడీ తర్వాత అంతటి గుర్తింపు పొంది జనం నోళ్ళలో నానారు ఈ ఇద్దరూ. ఇందుకు ప్రధాన కారణం ఆ ఇద్దరి మధ్య నడిచే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనే. వీళ్ళ చేష్టలతో ఈ ఇద్దరిపై జనాల్లో అనుమానాలు ముదిరాయి.
2/ 9
చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ జనం మెప్పు పొందాయి. కామెడీ పంచుతూనే రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు ఇమ్మానుయేల్- వర్ష.
3/ 9
చాలా సార్లు రొమాంటిక్ సాంగ్స్‌పై డాన్సులేసి తమ మధ్య కెమిస్ట్రీ ఎంత బలంగా ఉందో నిరూపించారు ఇమ్ము వర్ష. ఒంటరిగా కంటే జంటగా బాగా ఫేమ్ కొట్టేసిన ఈ జోడీకి సపరేట్ ఫాలోయింగ్ కూడా ఉంది. జబర్దస్త్ జడ్జ్‌లు సైతం ఈ జోడీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయినా సందర్భాలు బోలెడు.
4/ 9
దీంతో ఇమ్మానుయేల్- వర్ష మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ నడుస్తుందనే పుకార్లు తెగ షికారు చేస్తున్నాయి. పలు స్పెషల్ ఈవెంట్స్‌లో ఇమ్మానుయేల్- వర్ష పెళ్లి చేసేయడం పలు అనుమానాలకు తావిచ్చింది.
5/ 9
ఈ క్రమంలోనే ఇమ్మానుయేల్ ప్రేమలో వర్ష మునిగితేలుతోందని జనం చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ఈ ఇద్దరూ స్క్రీన్ పై కనిపిస్తే చాలు లవ్ సింబల్స్ వేసేసి తమ తమ షోకి టీఆర్ఫీ తెప్పించుకుంటున్నారు నిర్వాహకులు.
6/ 9
ఏదేమైనా ఇమ్ము వర్ష లవ్ ఎఫైర్ అనేది మాత్రం నిత్యం హాట్ టాపిక్ గానే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన లవ్ ఎఫైర్ విషయమై ఓపెన్ అవుతూ షాకిచ్చింది వర్ష. మనసులో మాట చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
7/ 9
ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో ఈ సీన్ కనిపించింది. ఇమ్మూ.. అందరిలో ఓ డౌట్ ఉంది. అసలు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా? అని.. అంటూ వర్ష ఎంటరై ఒక్కసారిగా అతనిపై తన లవ్‌ని వ్యక్తపరుస్తూ ఓపెన్ అయింది.
8/ 9
ఇమ్మూ కాదన్న రోజు ఈ వర్ష ఊపిరి ఆగిపోతుంది అని ఆమె చెప్పడంతో ఇమ్మూ తెగ సంతోషపడి పోయాడు. అంటే ఈ ఇద్దరూ నిజంగానే లవ్ ట్రాక్ నడిపిస్తున్నారని తాజా ప్రోమో కన్ఫర్మ్ చేసేసింది.
9/ 9
ఈ సీన్ నడుస్తుండగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకే ఒక లోకం నువ్వు అనే పాటను వేసి మరింత అట్రాక్ట్ చేశారు. సో.. చూడాలి మరి రీల్ లవర్స్ అయిన ఇమ్మూ- వర్ష తమ పెళ్లి శుభవార్త ఎప్పుడు చెబుతారనేది!.