జబర్దస్త్ వర్ష(Jabardasth Varsha).. ఇప్పుడు ఈ పేరు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ పేరు తెలియకపోయినా జబర్దస్త్ షో చూసే వాళ్లకు ఇమ్మాన్యుయేల్‌తో ఉంటుంది కదరా ఆ అమ్మాయే అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇమ్మూతో జోడీ కట్టిన తర్వాత వర్ష రేంజ్ అంతగా మారిపోయింది. అక్కడ వర్ష నుంచి ఇమ్మూకు.. ఇమ్మూ నుంచి వర్షకు ఇద్దరూ ఒకరి ద్వారా మరొకరు పాపురల్ అయ్యారు. (Image Credit : Instagram)
నిజానికి అతి తక్కువ సమయంలో బుల్లితెరలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్ష మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. తన అందంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటూ తన హాట్ ఫోటోలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. (Image Credit : Instagram)