వీరి ట్రాక్ మీద అందరికీ కాస్త ఇంట్రెస్ట్ కలగడంతో ఈ జోడీని బాగా వాడేస్తూ రొమాంటిక్ స్కిట్స్ వేయించారు. దీంతో వర్ష- ఇమ్మానుయేల్ మధ్య ఏదో నడుస్తుందనే టాక్ ముదిరింది. రష్మీ సుధీర్ ల తరువాత అంతటి క్రేజ్ దక్కించుకున్న జబర్దస్త్ జంట వర్ష- ఇమ్మానుయేల్. వీరిద్దరి రొమాంటిక్ కామెడీ స్కిట్స్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. (Image Credit : Youtube)
బయట సోషల్ మీడియాలో కూడా ఈ జంట అప్డేట్స్ తో రచ్చ చేస్తుంటారు. రెస్టారెంట్స్ ,వెకేషన్స్ కి కలిసి తిరుగుతూ వారిపై ఉన్న రూమర్స్ కి ఆక్సిజన్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ జోడీ రొమాంటిక్ మూమెంట్స్‌పై రాను రాను బోర్ రావడంతో ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించేసినా మళ్ళీ దాన్నే ఫోకస్ చేస్తూ వాళ్ళిద్దరి గుట్టు రట్టు చేసింది జబర్దస్త్ జడ్జ్ రోజా. ఇందులో భాగంగా రెండ్రోజుల క్రితం మీరిద్దరు ఎక్కడున్నారని అడుగుతూ వర్ష- ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ తెరపైకి తెచ్చింది రోజా. (Image Credit : Youtube)
దీంతో ఆ రోజు నేను షూటింగ్లో ఉన్నాను..ఇమాన్యుయేల్ వేరే చోట ఉన్నాడు అని వర్ష చెప్పడంతో వెంటనే సీక్రెట్ ఫొటో బయట పెట్టేసింది రోజా. వేరు వేరు షూటింగ్స్ అని చెప్పి.. ఇద్దరు ఒకే దగ్గర కార్ లో తిరుగుతున్న ఫోటోని.. జబర్దస్త్ స్టేజిపై తన ఫోన్ లో చూపెట్టి అందరికి షాక్ ఇచ్చింది రోజా. (Image Credit : Youtube)