బుల్లితెరపై ఏది టీఆర్పీ స్టంట్ ఏది నిజమోనని జనాలు ఇట్టే పసి గట్టేస్తున్నారు. తమ షోలు, ఈవెంట్లు క్లిక్ అవ్వడం కోసం ప్రోమోలను వింత వింతగా రిలీజ్ చేస్తుంటారు. ప్రోమోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రోమోల్లో ఏడుపులు పెడబొబ్బులు తిట్టుకోవడం కిందపడిపోవడం వంటివి చేస్తూ ఎపిసోడ్ మీద బజ్ క్రియేట్ చేయాలని చూస్తుంటారు.