జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు కూడా తెలుసు. ఇప్పుడు హరి కూడా ఇదే చెప్పాడు. ఈయన జబర్దస్త్ ప్రేక్షకులకు హరితగా బాగా పరిచయం.
భాస్కర్ సహా అందరి స్కిట్స్‌లో కూడా అమ్మాయి వేషాలు వేస్తుంటాడు హరి. లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయిన ఈయన ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతున్నాడు హరి. జబర్దస్త్‌కు రాకముందే తన ఊళ్లో సెలబ్రిటీ అని.. లేడీ గెటప్స్‌లో చాలా స్కిట్స్ చేసానని చెప్పాడు.
ఆ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షో చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు ఈయన. ఇదిలా ఉంటే లేడీ గెటప్స్ వేయడం వల్ల తనకు చాలా ఇబ్బందులు కూడా వస్తున్నాయని చెప్పాడు హరి. ముఖ్యంగా తన కుటుంబంలో పెద్దక్క తనను హిజ్రాతో పోల్చిందని ఏడ్చేసాడు ఈయన. అంతేకాదు బయట కూడా వేధింపులు వస్తాయని చెప్పాడు హరి. కొందరు తనకు ఐ లవ్ యూ కూడా చెప్పారని.. దాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదని చెప్పాడు హరి.
ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసినపుడు ఇలాంటివి తప్పవంటున్నాడు హరి. తాను కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. దేవుడిచ్చిన రూపాన్ని ఎలా మార్చుకుంటామని ప్రశ్నిస్తున్నాడు హరి. ఇదిలా ఉంటే జబర్దస్త్‌కు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం అడిగితే టీమ్ లీడర్స్ కూడా కొందరు రూమ్‌కు పిలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే వాళ్లెవరో చెప్పనంటున్నాడు హరి.