Gaalodu: గాలోడు సుడి మామూలుగా లేదుగా... మంచు విష్ణు 'జిన్నా' కన్నా ఎక్కువ వసూళ్లు
Gaalodu: గాలోడు సుడి మామూలుగా లేదుగా... మంచు విష్ణు 'జిన్నా' కన్నా ఎక్కువ వసూళ్లు
Gaalodu: సుడిగాలి సుధీర్ మూవీ గాలోడు.. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. జిన్నా కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తూ.. అందరికీ షాకిచ్చింది. మరి ఈ రెండు రోజుల్లో గాలోడు ఎంత వసూళ్లు రాబట్టాడో తెలుసుకుందాం.
బుల్లితెర పవర్ స్టార్‌గా పేరున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఇటీవలే గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవంబరు 18న ఈ చిత్రం విడుదలయింది. ఐతే అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన వసూళ్లనే రాబట్టుతోంది.
2/ 7
గాలోడు విడుదలైన తొలి రోజున 1.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. శనివారం 1.14 కోళ్ల వసూళ్లు వచ్చాయి. ఈ రెండు రోజులు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.35 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తంగా శుక్ర, శనివారాల్లో 1.20 కోట్ల షేర్ సాధించింది. ఈ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి
3/ 7
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.2.70 కోట్ల గ్రాస్, రూ.1.22 కోట్ల షేర్ సాధించింది గాలోడు మూవీ (Galodu Movie). మొత్తంగా 2.70 కోట్ల బిజినెస్ చేసింది. రూ.3 కోట్లు దాటితే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు. మరో రూ.1.78 కలెక్షన్స్ వస్తే.. గాలోడో మూవీ హిట్ అయినట్లే లెక్క.
4/ 7
మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్న జిన్నా మూవీ కంటే గాలోడు మూవీ ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. జిన్నా మూవీ అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు టాక్ బాగానే ఉన్నా.. జనాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. థియేటర్లకు వెళ్లలేదు.
5/ 7
మూవీలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుల్ వంటి హాట్ స్టార్లు ఉన్నప్పటికీ.. ప్రేక్షులను థియేటర్లకు రప్పించలేకపోయారు. అందువల్ల తొలి రోజు నుంచే జిన్నా డీలా పడింది. మొదటి రోజు 12 లక్షలు, రెండో రోజు 10 లక్షల షేర్ మాత్రమే సాధించింది.
6/ 7
జిన్నా మూవీ తొలి రెండు రోజులు కలిపి రూ.25 లక్షల గ్రాస్ కూడా సాధించలేదు. కోటి మార్క్‌ని చేరుకునేందుకు వారం రోజుల సమయం పట్టింది. కానీ గాలోడు మూవీ మాత్రం విడుదలైన తొలి రోజే అదరగొట్టిందని లెక్కలు చెబుతున్నాయి.
7/ 7
జిన్నా, గాలోడు మూవీ కలెన్షన్లను పోల్చి చూస్తూ.. మా అధ్యక్షుడు మంచు విష్ణుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గొప్పలు చెప్పుకునే మంచు ఫ్యామిలీ.. కనీసం సుడిగాలి సుధీర్ సాధించినన్ని కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయారని సెటైర్లు వేస్తున్నారు.